హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మూడు రోజులు భారీ వర్షాలు: అనవసరంగా బయటికి రావొద్దు, సీఎస్ అలర్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అవసరముంటేనే బయటికి రావాలని సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాల బీభత్సం

సోమవారం అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. హుస్సేన్ సాగర్ కు కూడా వరద పోటెత్తింది. ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎస్ సోమేశ్​ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల చేపట్టాల్సిన జాగ్రత్తలు, అంటువ్యాదులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సహయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సోమేశ్​ కుమార్ సూచించారు.

భారీ వర్షాలు.. అనవసరంగా బయటికి రావొద్దు..

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో ఉస్మాన్‌​సాగర్, హిమాయత్‌​సాగర్ జలాశయాలకు వరద అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండినందున గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను సీఎస్​ అప్రమత్తం చేశారు.

రహదారులు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలు, ప్రయాణికులను నిలిపి వేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించకుండా తగు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు శాఖ, నీటిపారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సోమేశ్​ కుమార్ సూచించారు.

మరో మూడు రోజులపాటు వర్షాలు కురుసే అవకాశం ఉండటంతో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.

English summary
three more days heavy rains in telangana districts: CS alerted officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X