లారీని ఢీకొట్టిన కారు: తండ్రి, ఇద్దరు కొడుకులు మృతి, 5గురికి గాయాలు(పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

బంధువుల కథనం ప్రకారం.. బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీకి చెందిన పోతరాజు చిరంజీవి(47), భార్య ఈశ్వరి(45) ప్రైవేటు ఉద్యోగులు. వీరికి కృష్ణ చలపతి(16), గణేష్ చలపతి(14) కుమారులు. చిరంజీవి విజయవాడ నుంచి నగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చారు.

తెలంగాణ అఖిల బ్రాహ్మణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజమండ్రిలోని బంధువు మరణించారనే సమాచారంతో భార్య, ఇద్దరు కుమారులు, తోడల్లుడి కుటుంబంతోపాటు ఆదివారం ఉదయం కారులో పయనమయ్యారు. వీరి కారు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలోని మౌంట్ ఓపెరా దాటగానే జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న లారీ బలంగా ఢీకొట్టింది.

దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ చలపతి, గణేష్, సత్యనారాయణమూర్తి విమలమ్మ, వైష్ణవ్, పరిపూర్ణ, ఈశ్వరి, విష్ణు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళుతుండగానే కృష్ణ, గణేష్‌లు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొట్టిన లారీ

కారు ఢీకొట్టిన లారీ

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుడు చిరంజీవి

మృతుడు చిరంజీవి

బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీకి చెందిన పోతరాజు చిరంజీవి(47), భార్య ఈశ్వరి(45) ప్రైవేటు ఉద్యోగులు. వీరికి కృష్ణ చలపతి(16), గణేష్ చలపతి(14) కుమారులు. చిరంజీవి విజయవాడ నుంచి నగరానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చారు.

మృతుడు కృష్ణ

మృతుడు కృష్ణ

రాజమండ్రిలోని బంధువు మరణించారనే సమాచారంతో భార్య, ఇద్దరు కుమారులు, తోడల్లుడి కుటుంబంతోపాటు ఆదివారం ఉదయం కారులో పయనమయ్యారు.

గాయపడిన ఈశ్వరి

గాయపడిన ఈశ్వరి

వీరి కారు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలోని మౌంట్ ఓపెరా దాటగానే జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న లారీ బలంగా ఢీకొట్టింది.

మృతుడు గణపతి

మృతుడు గణపతి

దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ చలపతి, గణేష్, సత్యనారాయణమూర్తి విమలమ్మ, వైష్ణవ్, పరిపూర్ణ, ఈశ్వరి, విష్ణు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన ప్రపూర్ణ

గాయపడిన ప్రపూర్ణ

వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళుతుండగానే కృష్ణ, గణేష్‌లు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన సత్యనారాయణ

గాయపడిన సత్యనారాయణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సత్యనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైష్ణవ్

వైష్ణవ్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైష్ణవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విమల

విమల

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విమల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+