హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాబ్‌ను ఢీకొట్టిన లారీ: ఫ్యామిలీలో ముగ్గురు మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్‌కు సమీపంలోని గన్సీమియాగూడ వద్ద సోమవారం ఉదయం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృతి చెందారు.

శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని సుందర ప్రదేశాలను చూసేందుకు గాను 12మంది కుటుంబ సభ్యులతో కూడిన మ్యాక్సీ క్యాబ్‌లో ఆదివారం నగరానికి వచ్చారు.
నగరంలోని చార్మినార్, గోల్కండ ఖిల్లా, బిర్లా మందిర్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పలు ప్రదేశాలను సందర్శించి, తిరిగి ప్రయాణంలో ఇంటికి వెళుతుండగా ప్రమాదం సంభవించిందని తెలిపారు.

Three tourists, lorry driver killed in morning mishap

మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్ టీ తాగేందుకు గాను గన్సీమియాగూడ సమీపంలో క్యాబ్‌ను ఆపాడు. టీ తాగిన అనంతరం కుటుంబ సభ్యులంతా క్యాబ్‌లో ఎక్కి కూర్చున్నారు. క్యాబ్ డ్రైవర్ బండిని స్టార్ట్ చేసే లోపులో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ భారీ ట్రక్కు క్యాబ్ వెనుక భాగంలో ఢీ కొట్టింది.

దీంతో క్యాబ్‌లో ఉన్నవాళ్లంతా చెల్లా చెదురుగా రోడ్డుపై పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన గీత (30) అక్కడిక్కడే మృతి చెందగా... ప్రియాంక (20), కమలాభాయ్ (30)లతో పాటు లారీ డ్రైవర్ జ్ఞానేశ్వర్ (45) చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

మిగిలిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం అక్కడ్ వీధి లైట్లు లేకపోవడం కాగా, క్యాబ్‌ను టీ కోసం నిలిపినప్పుడు డ్రైవర్ సిగ్నల్ లైట్లు వేయకపోడవం మరో కారణమని పోలీసులు వెల్లడించారు.

నివాస ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా వీధి లైట్లను పెట్టకపోవడం వల్లనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

English summary
Lack of streetlights and non-adherence to basic road safety rules by a maxi cab driver resulted in the death of four people at Ghansimiyaguda near Shamshabad on NH-44 in the wee hours of Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X