కర్నూలు సిఐడి అదనపు ఎస్పీ కొడుకు వీరంగం: మహిళా టెక్కీ కిడ్నాప్ యత్నం
హైదరాబాద్: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన మలకపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళా టెక్కీ వనస్థలిపురంకు చెందినవారు. ఆమె అమీర్ పేటలోని ఓ కంపెనీలో సాఫ్టువేక్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని దిల్ సుఖ్ నగర్లో స్నేహితురాలిని కలిసేందుకు టిఎంసి వద్ద నిలబడింది. ఇంతలో ముగ్గురు యువకులు ఎపి 09 సిఆర్ 5130 కారులో మహిళ వద్దకు వచ్చి కిడ్నాప్‌కు యత్నించారు.

ఈ సంఘటనను చూసిన ఓ వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతని పైన దాడికి పాల్పడ్డారు. అతను దాడికి గురైన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు కిడ్నాప్‌కు యత్నించిన శ్రీకాంత్, వెంకటేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ అనే వ్యక్తి పరారయ్యాడు. వారి పైన పోలీసులు నిర్భయ కేసు పెట్టారు. శనివారం రిమాండుకు తరలించారు.
కాగా, శ్రీకాంత్ తండ్రి కర్నూలులో సిఐడి విభాగంలో అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు. మద్యం మత్తులో.. అదీ సిఐడి అదనపు ఎస్పీ తనయుడు శ్రీకాంత్ స్నేహితులతో కలిసి సాఫ్టువేర్ ఇంజనీర్ కిడ్నాప్‌కు యత్నించడం గమనార్హం.












Click it and Unblock the Notifications