ఖానాపూర్‌లో పెద్దపులి సంచారం: భయాందోళనల్లో స్థానికులు

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం ఇక్బాల్ పూర్ గ్రామంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్ధానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో స్థానికులు భాయందోళనకు గురవుతున్నారు.

ఆదివారం రాత్రి నిర్మల్ వైపు నుంచి ఒక కుటుంబం కారులో వస్తున్న సమయంలో పెద్దపులి తిరుగుతుండటం వారు గమనించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు.

దీంతో డీఎఫ్ఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు సోమవారం ఇక్బాల్ పూర్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పెద్దపులి అడుగుజాడలు ఉండటాన్ని గుర్తించారు. స్థానికులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Tiger came to iqbalpur village in Adilabad district

నవ వధువు అనుమానాస్పద మృతి

పెళ్లైయిన ఐదు నెలలకే ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎల్బీ నగర్‌లోని శివనగర్ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. గోవా నుంచి సోమవారం ఉదయం 5 గంటలకు అత్తవారింటికి చేరుకున్న యువతి ఆరు గంటలకు మృతి చెందింది.

రైల్వే జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రంజిత్ గౌడ్‌తో ఆమెకు ఐదు నెలల క్రితం వివాహమైంది. దాదాపూ రూ. కోటి వరకు కట్నంగా తీసుకున్న రంజిత్ గౌడ్ మరింత కట్నం కావాలని వేధించేవాడని యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+