హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్రెండ్స్‌తో జల్సా, నాతో మందు-గంజాయి తాగు: శాడిస్ట్ ఎన్నారై భర్త, భార్య ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై భర్త వేధింపులకు మరో యువతి బలయింది. అమెరికాలో భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ కాకతీయ నగర్‌లో చోటు చేసుకుంది. మాధురి అనే యువతి రెండు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చింది. భర్త వేధింపుల కారణంగానే వచ్చినట్లు తెలిపింది. శనివారం ఇంట్లో ఉరేసుకుంది.

ప్రేమించి, పెళ్లైన కొద్ది రోజులకే ఆస్తి కోసం వేధింపులు, అందుకే టెక్కీ ఆత్మహత్యప్రేమించి, పెళ్లైన కొద్ది రోజులకే ఆస్తి కోసం వేధింపులు, అందుకే టెక్కీ ఆత్మహత్య

తనతో మందు కొట్టాలని, పేకాట ఆడాలని, స్నేహితులతో కలిసి జల్సా చేస్తున్న సమయంలో భార్యను ఉండమని చెప్పి అమెరికాలో ఆ భర్త వేధించేవాడని ఆరోపిస్తున్నారు. వీకెండ్ పార్టీలో బాగా వేధించేవాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరిగి వచ్చి, పుట్టింట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మద్యం తాగాలని, పేకాట ఆడాలని వేధింపులు

మద్యం తాగాలని, పేకాట ఆడాలని వేధింపులు

తనతో తాగాలని, పేకాట ఆడాలని నిత్యం వేధించేవాడని అమ్మాయి చెప్పిందని తల్లిదండ్రులు చెప్పారు. తమకు తాహత లేకపోయినప్పటికీ కూతురున బాగా చదివించి, అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే వేధించి, ఇప్పుడు చావుకు కారకుడయ్యాడని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన తమ కూతురు తిరిగి వచ్చిందని చెప్పారు. తమ కూతురు మాధురు తన భర్త కోటేశ్వర రావు గురించి ఎప్పుడు ఏమీ చెప్పలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

కఠిన శిక్షకు తల్లిదండ్రుల డిమాండ్

కఠిన శిక్షకు తల్లిదండ్రుల డిమాండ్

కానీ తన కూతురు భర్త కోటేశ్వర రావు, పెద్దలు మాత్రం మీ కూతురు పనికి రాదని, మాకు ఏమీ ఇవ్వలేదని వేధించేవారని, మనం లేని వాళ్లం కాబట్టి వాళ్లు ఏమన్నా ఓపికతో ఉండాలని తన కూతురుకు చెప్పానని తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. మా అమ్మ చెప్పినట్లు, నేను చెప్పినట్లు వినడం లేదని అతను చెప్పేవాడని, తన కూతురు చావుకు కారణమైన వారిని వదిలిపెట్టవద్దని, వారికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు.

మద్యం తాగాలని, గంజాయి సేవించాలని కొట్టేవాడు

మద్యం తాగాలని, గంజాయి సేవించాలని కొట్టేవాడు

మాధురికి 2016 నవంబర్ నెలలో 9వ తేదీన కోటేశ్వర రావుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు అమెరికా వెళ్లారు. భర్త సాఫ్టువేర్ ఇంజినీర్. కొన్నాళ్ల తర్వాత తనతో కలిసి పేకాట ఆడాలని, మందు కొట్టాలని, డ్యాన్స్ చేయాలని, గంజాయి సేవించాలని భార్యపై ఒత్తిడి చేసేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతని మాటను కాదంటే కొట్టేవాడని తెలుస్తోంది.

స్నేహితులతో కలిసి జల్సా

స్నేహితులతో కలిసి జల్సా

స్నేహితులతో జల్సాలు చేయడం, మద్యం, డ్రగ్స్ తీసుకోవడం అతని దినచర్యగా ఉందని చెబుతున్నారు. భార్యను కూడా అదే రొంపిలోకి దింపాలని ప్రయత్నించాడు. అందుకే తనతో కలిసి తాగమని చెప్పేవాడు. మాధురి తల్లిదండ్రులు గంగా, మల్యాద్రిలు. వీరిది ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు. ఇరవై ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌కు వచ్చి జీవనం సాగిస్తున్నారు. మాధురి బిటెక్ చదవింది.

లోదుస్తుల్లో తాగాలని బలవంతం

లోదుస్తుల్లో తాగాలని బలవంతం

మాధురి భర్త కోటేశ్వర రావు తల్లిదండ్రులు సుబ్బులు, వెంకటేశ్వర్లు. వీరు ఒంగోలుకు చెందిన వారు. జీడిమెట్లలోని షాపూర్ నగర్‌లో ఉంటున్నారు. మధ్యవర్తుల ద్వారా సంబంధం కుదిరింది. అమెరికా వెళ్లాక మనస్పర్థలు వచ్చాయి. పెద్దలు నచ్చచెప్పారు. అయినా భర్తలో మార్పు రాలేదు. భార్యను లోదుస్తులతో మద్యం తాగాలని, పేకాట ఆడాలని బలవంతం చేసేవాడని, లేదంటే కొట్టేవాడని చెబుతున్నారు. అమెరికాలో భర్త చేష్టలతో విసిగి ఆమె రెండు రోజుల క్రితం తిరిగి వచ్చింది. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అనంతరం శనివారం ఉదయం ఉరి వేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

English summary
A 24 year old woman, allegedly harassed by her husband in America, returned to her parents' place in Hyderabad and committed suicide by hanging herself from the ceiling with her dupatta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X