ఆ అయిదు బ్యాంకులు.. ఏప్రిల్ 1 నుంచి కనిపించవు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) కథ ముగిసింది. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్‌కు ఈ నెల 31 చివరి రోజు కానుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ బ్యాంక్‌తో పాటు మరో నాలుగు బ్యాంక్‌లు ఎస్‌బీఐలో విలీనం కాబోతున్నాయి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో పాటు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాల బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేస్తున్నారు.

2 వేలకుపైగా శాఖలున్న ఎస్‌బీహెచ్‌ తెలంగాణ వ్యాప్తంగా 731 బ్యాంక్‌ శాఖలను కలిగి ఉంది. ఎస్‌బీహెచ్‌ ఖాతాదారులంతా ఇక ఎస్‌బీఐ వినియోగదారులుగా మారనున్నారు. 1941 ఆగస్టు 8న చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ చట్టం కింద హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.

Today is the last working day for those 5 banks

నిజాం రాష్ట్ర కరెన్సీ నిజాం సిక్కాను ఈ బ్యాంక్‌ నుంచే నిర్వహించారు. 1942 ఏప్రిల్‌ 5న గన్‌ఫౌండ్రీలో మొదటి హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ శాఖను ఏర్పాటు చేశారు. బ్యాంక్‌ల విలీనంతో 1956లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ విలీనమైంది.

దీంతో బ్యాంక్‌ పేరును స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా మార్చారు. రిజర్వు బ్యాంక్‌కు మొదటి అనుబంధ బ్యాంక్‌గా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అతిపెద్ద అసోసియేట్‌ బ్యాంక్‌గా ఎస్‌బీహెచ్‌ పనిచేస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Today is the last working day for those 5 banks. From tomorrow onwards the State Bank of Hyderabad, State Bank of Bikaneer and Jaipur, State Bank of Mysore, State Bank of Travencore, State Bank of Patiyala are merging into State Bank of India.
Please Wait while comments are loading...