నేడే గ్రూప్-2 పరీక్ష : నిముషం ఆలస్యమైనా.. లోనికి అనుమతించరు!
హైదరాబాద్ : మరికొద్ది గంటల్లో నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు పలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
పరీక్ష కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు.. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరయాలు లేకుండా చూడడం.. అలాగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి రూ.500, రూ.1000నోట్ల చెల్లింపును ఆర్టీసీ బస్సుల్లో సమ్మతించడం.. వంటి చర్యలు చేపట్టింది టీఎస్ పీఎస్సీ. దాదాపు 7.83 లక్షల మంది గ్రూప్-2 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా గురువారం రాత్రి వరకు 6.81 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు.

పరీక్ష సమయంలో..
ఉదయం 8.15 గం.కు పరీక్ష కేంద్రాల గేటు తెరుస్తారు. 9.45 గం. లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రం మధ్యా హ్నం పరీక్షకు 1.15 గం. నుంచి 2.15 గం. వరకు లోనికి అనుమతిస్తారు. నిముషం ఆలస్యమైనా సరే.. లోనికి అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లోకి అడుగుపెట్టాక.. తొలుత బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలను నమోదు చేస్తారు.
హాల్ టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పానకార్డు, డ్రైవింగ్ లైసెన్సు లాంటి ఏదేని ఒక ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి. ఐడీతో పాటు రెండు పోర్టు సైజు ఫోటోలు కూడా వెంట తెచ్చుకోవాలి.












Click it and Unblock the Notifications