వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం.!వికలాంగుల సంక్షేమమే లక్ష్యమన్న మంత్రి సత్యవతి రాథోడ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అంగ వైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తోందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకంక్షలు తెలిపారు. దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని మంత్రి సత్యవతి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులకు కావలసిన పరికరాలను, వస్తువులను వారికి అందజేసారు.

దివ్యాంగుల సంక్షేమంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రగామి.. వికలాంగులకు మంత్రి సత్యవతి శుభాకాంక్షలు

దివ్యాంగుల సంక్షేమంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రగామి.. వికలాంగులకు మంత్రి సత్యవతి శుభాకాంక్షలు

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ దివ్యాంగులకు స్పూర్తి వంతమైన ఉపదేశం చేసారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగంలో ఉందన్నారు. దివ్యాంగులకు 3,016 రూపాయల ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్ స్కూటీలను అందిస్తున్నామన్నారు. వీటితో పాటు కృత్రిమ కాళ్లు, చేతులు తయారు చేసే యూనిట్ తో హైదరాబాద్ లో అతిపెద్ద పార్క్ ను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.

అనేక సంక్షేమపథకాలు.. దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్న మంత్రి.

అనేక సంక్షేమపథకాలు.. దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్న మంత్రి.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, కల్పిస్తున్నామని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల 2018,2019 సంవత్సరాలలో కేంద్రం దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి, అవార్డులు ఇచ్చిందన్నారు. వీటితో పాటు భవిష్యత్ లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

నెక్లెస్ రోడ్ లో వికలాంగుల ర్యాలీ.. పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

నెక్లెస్ రోడ్ లో వికలాంగుల ర్యాలీ.. పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

ఇదిలా ఉండగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో వికలాంగుల ర్యాలీని ప్రారంభించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, దైవజ్ఞ శర్మ, వికలాంగుల హక్కుల వేదిక చైర్మన్ కొల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ వికలాంగుల కోసం జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

జాతీయ వికలాంగ కమీషన్ కోసం లేఖ. కేంద్ర సానుకూలంగా స్పందించిందన్న వినోద్ కుమార్

జాతీయ వికలాంగ కమీషన్ కోసం లేఖ. కేంద్ర సానుకూలంగా స్పందించిందన్న వినోద్ కుమార్

జాతీయ వికలాంగుల కమిషన్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కు ఇటీవల తాను లేఖ రాశానని, ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వినోద్ కుమార్ తెలిపారు. వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరిన్ని రిజర్వేషన్లు కల్పించి ప్రాధాన్యతను ఇవ్వాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

English summary
The state ministers have made it clear that there is no need to be crippled by disability and that the Telangana government is encouraging the disabled in all sorts of ways. Minister of State for Tribal Affairs, Women and Child Welfare, Mrs. Satyavathi Rathore, wished the disabled in the state on the occasion of World Disability Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X