Rana: వీడియో: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో..ఈడీ విచారణకు హాజరు: సాయంత్రం వరకూ
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భూకంపాన్ని సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ దూకుడు కొనసాగిస్తోన్నారు. విచారణ పర్వాన్ని మరింత ముమ్మరం చేశారు. రెండో దఫా ఈ కేసును తెరమీదికి తీసుకొచ్చిన ఈడీ అధికారులు కీలక సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన లీడ్‌తో ఈ కేసును తిరగదోడారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన టాలీవుడ్ నటీనటులు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇదివరకే సమన్లను జారీ చేశారు. ఇప్పటికీ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లను విచారించారు.

రానా వంతు
ఇక రానా దగ్గుబాటి వంతు వచ్చింది. ఈడీ అధికారుల నుంచి కొద్దిరోజుల కిందటే ఆయన నోటీసులను అందుకున్నారు. తాజాగా విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట ఒకరిద్దరు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి సమక్షంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రానా దగ్గుబాటిని విచారిస్తారని తెలుస్తోంది. ఈ సాయంత్రం వరకూ విచారణ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

కెల్విన్ నుంచి కీలక లీడ్స్..
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరగదోడటానికి ప్రధాన కారణం.. డ్రగ్ పెడ్లర్ కెల్విన్. ప్రస్తుతం అతను పోలీసుల ఆధీనంలో ఉన్నాడు.. విచారణను ఎదుర్కొంటోన్నాడు. దర్యాప్తు సందర్భంగా అతను ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మళ్లీ టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులను జారీ చేశారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. దర్యాప్తును ముమ్మరం చేశారు. పూరీ జగన్నాథ్‌తో ఆరంభమైన ఈ విచారణల పర్వం.. ఇక- సుదీర్ఘంగా కొనసాగబోతోంది. డ్రగ్స్ కేసు మూలాల నుంచీ ఆరా తీస్తారని తెలుస్తోంది.

పూరీ, ఛార్మీ, రకుల్‌తో
ఈ కేసుతో ప్రమేయం ఉన్న టాలీవుడ్ ప్రముఖులందరినీ వరుసబెట్టి విచారణకు పిలుస్తున్నారు ఈడీ అధికారులు. ఇది ముగింపుదశకు వచ్చే సరికి కొన్ని అరెస్టులు కూడా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కిందటి నెల 31వ తేదీన పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించారు. చాలాకాలంగా ఆయనతో అసోసియేట్ అయి ఉన్న నటి ఛార్మీ, అనంతరం రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించారు. టాలీవుడ్‌లో డ్రగ్ లింకులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.

డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇన్ఫర్మేషన్..
ప్రత్యేకించి డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్‌గా మారిన తరువాత లభించిన పక్కా సమాచారంతో ఈ విచారణను సాగించారు..ఛార్మిని ప్రశ్నించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపైనా వారు దృష్టి సారించారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఛార్మి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేశానని, వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈడీ విచారణకు తాను సహరించాననీ, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని అన్నారు.
Recommended Video
లిస్ట్ పెద్దదే..
ఇదివరకు టాలీవుడ్‌లో తీవ్ర దుమారానికి కారణమైన ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొద్దిరోజుల కిందటే తిరగదోడింది. డ్రగ్స్ కేసు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వారిలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మీతో పాటు దగ్గుబాటి రానా, తరుణ్, ముమ్మైత్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటీనటుల పేర్లు ఉన్నాయి. రానా దగ్గుబాటి విచారణ పూర్తయిన తరువాత.. గురువారం తరుణ్‌ను విచారణకు పిలుస్తారని సమాచారం.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications