• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Tollywood Gossips: అనంతపురంలో గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్రత్యేక అతిథి ఎవరంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. అనంతపురంలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథి ఎవరు.. నయన్ శివన్ దంపతులు పిల్లలకు ప్లాన్ చేస్తున్నారా.. ఇలాంటి గాసిప్స్ అండ్ టాలీవుడ్ సినిమాకు సంబంధించిన వివరాలు మీకోసం

మహేష్ బాబు మూవీలో హాలీవుడ్ స్టార్

మహేష్ బాబు మూవీలో హాలీవుడ్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండగా మరో మూవీని దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు.ముందుగా త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేస్తారు మహేష్ బాబు. ఆ తర్వాత జక్కన్న చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది. మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ సరసన RRR భామ ఆలియా భట్ నటించనున్నట్లు సమాచారం. ఆలియా భట్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఆ తర్వాతే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుంది.అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్‌ మహేష్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.. ఒకవేళ ఇదే నిజమైతే జక్కన్న-మహేష్ బాబు చిత్రం హాలీవుడ్‌లో కూడా ఇరగదీస్తుందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

పిల్లలకు ప్లాన్ చేస్తోన్న నయన్-శివన్ దంపతులు..?

కొత్త దంపతులు నయనతార-విఘ్నేష్ శివన్‌లు హనీమూన్‌తో చాలా బిజీగా ఉన్నారు. స్పెయిన్‌లో వీరు గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా కొంత కాలం హల్చల్ చేశాయి. తాజాగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. దీంతో అభిమానులకు ఓ సందేహం కలిగింది. Some kids time... Practice for the future అంటూ పిల్లలకు సంబంధించిన పోస్టును పెట్టాడు. ఇంకేముంది ఈ పోస్టుకు అభిమానులు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నయనతార ఇప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చని కొందరు చెబుతుండగా... మరికొందరు మాత్రం ఈ త్వరలో ఈ సెలెబ్ కపుల్ ఓ బిడ్డకు ప్లాన్ చేస్తున్నారంటూ రాసుకొచ్చారు.

అనంతపురంకు సల్మాన్ ఖాన్

అనంతపురంకు సల్మాన్ ఖాన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. అయితే ప్రమోషన్స్ పరంగా చూస్తే ఇప్పటి వరకు ఈ మూవీ వెనబడే ఉందని చెప్పాలి. గాడ్ ఫాదర్ చిత్రం ప్రమోషన్స్ సరిగ్గా జరగడం లేదనే అసంతృప్తి మెగాస్టార్‌లో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, అదే సమయంలో చిరు చెప్పిన ఓ డైలాగ్‌ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవే ఈ చిత్రానికి కొంత ప్రమోషన్‌గా ఉపయోగపడ్డాయి. ఇక తాజాగా చిరంజీవిని శ్రీముఖి ఓ విమానంలో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.అయితే సినిమాకు సంబంధించి ప్రమోషనల్ టాక్ కూడా ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు

గాడ్ ఫాదర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 28వ తేదీన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోందట. ఇందుకోసం ఈ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను స్పెషల్‌గా ఇన్వైట్ చేసినట్లు సమాచారం.సల్మాన్‌ ఖాన్‌ను చిరంజీవే ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సల్మాన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చేందుకు ఒప్పుకున్నట్లు వినికిడి.ఈ సినిమాలో చిరుతో కలిసి సల్మాన్ కూడా ఓ పాటకు స్టెప్పులేశాడు. అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి స్టేజ్‌పై స్టెప్పులేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు.

English summary
News is making rounds that Hollywood star will be joining in Mahesh Babu and Rajmouli movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X