తెలంగాణలో టాప్ 10 జలపాతాల గురించి తెలుసా..?
తెలంగాణలో చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటుగా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో వాటర్ ఫాల్స్ పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి. అయితే తెలంగాణలోని టాప్ 10 వాటర్ ఫాల్స్ వివరాలు ఓసారి చూస్తే..
కుంటాల జలపాతం.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం 80 అడుగుల పైనుంచి కిందకి జాలువారుతోంది. పాల నురగలను తలపిస్తూ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు గుట్టల మధ్య నుంచి జాలువారుతున్న కుంటాల జలపాతాన్ని చూసేందుకు ఆదిలాబాద్ నుంచే కాకుండా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తుంటారు.
బోగత జలపాతం.. తెలంగాణ నయాగరాగా పిలువబడుతున్న బోగత జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ దారి పొడవునా ఎటుచూసినా అందమైన ప్రదేశాలు పర్యాటకులని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్ని ఆస్వాదించేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
మల్లెల తీర్థం జలపాతం.. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట సమీపంలో ఈ జలపాతం ఉంది. సుమారు 150 అడుగుల ఎత్తు నుండి నీళ్లు కిందకు పడతాయి. మహాశివుడు కోలువైన ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు చిహ్నంగా నిలుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. గాయత్రి జలపాతం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఈ జలపాతం ఉంది. గాయత్రి జలపాతం దాదాపు మూడు వందల అడుగుల ఎత్తయిన రాతి శిలలపై నుంచి జాలువారుతుంది. అలాగే ఇక్కడ వాటర్ రాపేల్లింగ్ ఫీలింగ్ , జుమార్ , రాఫ్టింగ్ క్లింబింగ్, బోటింగ్ తదితర సాహస క్రీడలు నిర్వహిస్తున్నారు.
పొచ్చెర జలపాతం.. కుంటాల జలపాతానికి అత్యంత సమీపంలోనే పొచ్చెర జలపాతం కూడా ఉంది. ప్రకృతి మధ్య ఓ అద్భుతమైన ప్రదేశంగా ఇది ఉంది. ఈ జలపాతం నిరంతరం నీటితో నిండి ఉంటుంది. కుటుంబంతో కలిసి వెళ్లడానికి బెస్ట్ టూరిజం స్పాట్ అని చెప్పొచ్చు. ఇక తెలంగాణ స్విట్జర్ల్యాండ్ జలపాతంగా కనకాయి జలపాతానికి పేరుంది. ఈ జలపాతం కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది. ఇక్కడ సాహస ప్రేమికులు ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తారు. ఇక భీమునిపాదం జలపాతం విశేషాలు చూస్తే.. మహబూబ్‌బాద్ జిల్లాలోని గూడూరు సమీపంలో ఈ జలపాతం ఉంది.

అలాగే ముత్యాల ధార జలపాతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అడవుల్లో ఉంది. ఈ వాటర్ ఫాల్స్ విశేషం ఏంటంటే..? దాదాపు 700 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడుతుంటాయి. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే అడవిలో ఒకటిన్నర గంట నడవాల్సి ఉంటుంది. నడకదారిలో ప్రకృతి అందాలు బాగుంటాయి. సప్త గుండాల జలపాతం వివరాలు చూస్తే.. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం సమీపంలో ఉంది. ఈ జలపాతం చిన్న చిన్న ప్రవాహాలుగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే శబ్దం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications