సురేఖను కాపాడేందుకు ప్రయత్నించినా.. ఇదీ జరిగింది- టీపీసీసీ చీఫ్..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారింది. కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. సురేఖ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెబుతున్నా... ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సురేఖ ఎపిసోడ్ లో ఢిల్లీలో జరిగిన పరిణామాల పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక అంశాలను వెల్లడించారు.

కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సురేఖ ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో చర్చించే ప్రయత్నం చేసారు. ఖార్గేతో భేటీ అయ్యారు. ఆ తరువాత హైకమాండ్ మూడ్ అర్దం కావటంతో సురేఖ ఢిల్లీ లోనే సీఎం రేవంత్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. కాగా.. కొండా సురేఖ ఎపిసోడ్ లో ఏఐసీసీ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామని తెలిపారు. సురేఖ విషయంలో అందరం తమ వంతు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. కొండా సురేఖ బర్తరఫ్‌ పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమని.. ఆమె విషయంలో హైకమాండ్ ఒప్పుకోలేదని టీపీసీసీ చీఫ్ చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో నాయకత్వం కఠినంగా ఉందని వివరించారు.

 సురేఖ అడుగులు ఆ పార్టీ వైపే, కండీషన్స్ అప్లై - కీలక మంత్రాంగం..!!
సురేఖ అడుగులు ఆ పార్టీ వైపే, కండీషన్స్ అప్లై - కీలక మంత్రాంగం..!!
tpcc-chief-mahesh-kumar-goud-reveals-reasons-behind-aicc-decision-against-konda-surekha

మంత్రివర్గ విస్తరణ పైనా క్లారిటీ

కాగా.. క్యాబినెట్ విస్తరణపైనా స్పష్టత ఇచ్చారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లే అని స్పష్టం చేశారు. ఢిల్లీలో క్యాబినెట్ విస్తరణపై చర్చ జగలేదన్నారు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపైనే చర్చ జరిగినట్లు చెప్పుకొచ్చారు. క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమన్నారు. 'నాకు మంత్రి పదవి అన్న ప్రచారంపై సమాచారం లేదు' అని వెల్లడించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ నెరవేర్చారని టీపీసీసీ చీఫ్ అన్నారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశామని తెలిపారు. రాబోయే వంద రోజులు దేశ వ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తామన్నారు. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయాలని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+