ముదిరాజ్ వర్గం మద్దతెవరికి - రేవంత్ క్లారిటీ, కీలక మలుపు..!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మరో రెండు రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. అధికారం ఖాయమనే విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ అన్ని వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్న ముదిరాజ్ వర్గానికి బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదు. కాంగ్రెస్ మూడు స్థానాలు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో ముదిరాజ్ వర్గం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని కీలక మలుపుగా భావిస్తున్నారు.
రేవంత్ కీలక హామీ : తెలంగాణలో పార్టీల ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని వర్గాల ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో దాదాప 50 లక్షల మంది ఉన్న ముదిరాజ్ వర్గానికి గతంలో ఒక్క ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ఆ వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇక, ఈటల బీఆర్ఎస్ వీడిన తరువాత ఆ పార్టీ నుంచి ఆ వర్గానికి చెందిన మరెవరికీ సీట్లు ఇవ్వలేదు. తాజాగా కొంత మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నా వారికి అసెంబ్లీ సీట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ సామాజిక సమీకరణాల్లో భాగంగా ముదిరాజ్ వర్గానికి మూడు సీట్లు కేటాయించింది.

ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యత : మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. ముదిరాజు బిడ్డలకు కాంగ్రెస్ 3 సీట్లు ఇచ్చింది... కానీ బీఆరెస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేసారు. ముదిరాజ్ వర్గానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మరింత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ముదిరాజ్ వర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని అంచనాలు పెరుగుతున్నాయి. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ ఫైర్ అయ్యారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి పాలమూరు గడ్డ పౌరుషం చూపాలన్నారు. మహబూబ్ నగర్ గడ్డపై 14 కు 14 సీట్లు కాంగ్రెస్ ను గెలిపించి వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పై ఫైర్ : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని రేవంత్ స్పష్టం చేసారు. బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్.. లక్ష కోట్లు దోచుకుండు, పదివేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతుందని చెప్పుకొచ్చారు. మార్పు కావాలి... కాంగ్రెస్ రావాలని నినదించారు. ఎన్నికల ప్రచారం మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో..ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్ కు 80 సీట్లు వస్తాయని ఇప్పటికీ రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్న ఈ సమయంలో అంతిమంగా ప్రజా తీర్పు ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications