చినజీయర్‌పై రేవంత్ రెడ్డి సీరియస్.. యాదగిరిగుట్ట బాధ్యతల నుంచి తొలగించాల్సిందే..!!
తెలంగాణ గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క-సారక్కలపై త్రిదండి చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయనపై భక్తులకు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమ్మక్క -సారలమ్మపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు . వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు నిరసనలకు దిగారు. క్షమాపణ చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
చినజీయర్‌ను తొలగించండి..
త్రిదండి చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించింది. గిరజనులకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు ఇలవేల్పుగా ఉన్న ఉన్న సమ్మక్క- సారక్కలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చినజీయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పున:నిర్మిస్తున్న యాదగిరి గుట్ట ఆగమ శాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి ఆయనను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అమ్మవార్లలపై చేసిన వ్యాఖ్యలను చినజీయర్ వెనక్కి తీసుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చట్టపరంగా చర్యలకు డిమాండ్
తెలంగాణ ప్రజల భక్తీపై చినజీయర్ స్వామి దాడి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్వవహించిన చినజీయర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాతా మూర్తి విగ్రహం పెట్టి చినజీయర్ స్వామి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయడం లేదా అని ప్రశ్నించారు. భక్తి ముసుగులో వేలకోట్లు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహారిస్తున్న చినజీయర్‌ను తెలంగాణ సమాజం క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video


సమ్మక్క-సారక్కపై చినజీయర్ ఎమన్నారంటే..
అటు చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మక్క-సారలమ్మను పూజించే తెలంగాణ సమాజాన్ని, ఆదివాసీలను చినజీయర్ స్వామి అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమక్క-సారక్క జాతార కేవలం బిజినెస్ అంటూ గతంతో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలను భక్తులు, రాజకీయ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన , నిరసనలకు దిగుతున్నారు.












Click it and Unblock the Notifications