వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్‌ని అడ్డుకోండి.. చీల్చి చెండాడండి.. మాకు తిక్క‌రేగితే.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మరోసారి హైదారబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇవాళ ( శుక్ర‌వారం ) వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శయంపేటలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఈక్రమంలో రేవంత్ ఇంటి వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. ర‌చ్చ‌బండ‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయ‌న‌ను గృహ నిర్బందం చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పోలీసులను ప్రైవేట్ సైన్యంలా మార్చారని దుయ్యబట్టారు.

Recommended Video

Revanth Reddy Arrest | Erravelli | Oneindia Telugu
 రైతులను పరామర్శించడం పాపమా!?..

రైతులను పరామర్శించడం పాపమా!?..

తెలంగాణలో రైతులు చస్తుంటే... పరామర్శించడం పాపమా!? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్... ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? అని నిలదీశారు. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు... కానీ... పేదరైతు కుటుంబాన్ని మేం పరామర్శిస్తుంటే తప్పా? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్ జిల్లాలో రచ్చబండ

వరంగల్ జిల్లాలో రచ్చబండ

వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శయంపేటలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న తమను గృహనిర్భంధం చేయడం సరికాదన్నారు. తెలంగాణ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా సీఎం కెసిఆర్ మార్చారని దుయ్యబట్టారు. పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఏసీపీని ప్రశ్నించారు. అటు నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి రచ్చబండ సందర్భంగా కూడా రేవంత్‌ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ మ‌ళ్లీ అరెస్ట్ చేశారు. దీంతో రేవంత్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.

కార్య‌కర్త‌లు ఆర్మీగా మారండి.. కేటీఆర్‌ని అడ్డుకోండి..

కార్య‌కర్త‌లు ఆర్మీగా మారండి.. కేటీఆర్‌ని అడ్డుకోండి..

హౌస్ అరెస్ట్‌ల‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ , విద్యార్థి నేతలు, కార్యకర్తలు ఆర్మీగా మారాలని సూచించారు.. నల్లొండ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడిక్కడ మంత్రి కేటీఆర్‌ను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాకు తిక్కరేగితే .. జైల్ భరో చేస్తామని.. అప్పుడు ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని కేసీఆర్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల‌ను ఉరితీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి..

English summary
TPCC Chief Revanth Reddy House arrest again and Serious on CM KCR and KTR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X