Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గృహ‌నిర్బంధంలో రేవంత్.. రచ్చబండ నిర్వహించి తీరుతాం.. కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత‌లు ఫైర్‌

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలో రైతుల సమస్యలపై "రచ్చబండ" కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టిముట్టారు. రేవంత్‌ని ఇంటి నుంచి బయటకు రాకుండా పహారా కాస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎర్రవెల్లిలో మీటింగ్ కు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

రేవంత్ గృహ‌నిర్బంధం

రేవంత్ గృహ‌నిర్బంధం

సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ రచ్చబండ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఈ కార్యక్రమానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయంటూ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. అటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను , కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎర్రవెల్లికి వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామాల ప్రజలను కూడా పోలీసులు తనిఖీలు చేసి పంపిస్తున్నారు.

ర‌చ్చ‌బండ నిర్వ‌హించి తీరుతా..

ర‌చ్చ‌బండ నిర్వ‌హించి తీరుతా..

పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎర్రవెల్లికి వెళ్తామని.. అక్కడే రచ్చబండ నిర్వహించి తీరుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కలిసి వడ్ల కొనుగోలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఎర్రవెల్లి గ్రామం ఏమైనా నిషేధిత ప్రాంతమా..? మమ్మల్నిఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులు నిలదీశారు. బీజేపీ , టీఆర్ఎస్ కుట్రలో భాగంగానే మంత్రులు ఢిల్లీ వచ్చి నాటకలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష‌ చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అక్ర‌మ అరెస్ట్‌లు.. నియంత పాలనకు నిదర్శనం..

అక్ర‌మ అరెస్ట్‌లు.. నియంత పాలనకు నిదర్శనం..

అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. ఇది నియంత పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఎర్రవెల్లిలో రచ్చబండ పెడితే సీఎం కేసీఆర్ కు అంత భయమెందుకని ప్రశ్నించారు . రైతులు సమస్యలు తెలుసుకునేందుకే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి వేసుకుంటారు.. కానీ, రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామన్న కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు తోక ముడ్చుకొని వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ ఆర్మీలాగా పని చేస్తున్నార‌ని మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+