వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే బహిష్కరిస్తామన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. టీఆర్ఎస్ ఫైర్ .. రెంటికీ చెడ్డ రేవడిలా కౌశిక్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ రాజకీయాలలో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి రేపిన దుమారం తెలిసిందే. హుజురాబాద్ టిఆర్ఎస్ టికెట్ తనకేనని కౌశిక్ రెడ్డి ఆడియో కాల్ లీక్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా ? నిజంగానే కౌశిక్ రెడ్డి కి టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందా ? లేక వ్యక్తిగత మైలేజీ కోసం కౌశిక్ రెడ్డి ఇదంతా చేస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

హుజూరాబాద్ పై కేసీఆర్ ప్రేమ .. రంగంలోకి ఎర్రబెల్లి, ఇంట్రెస్టింగ్ గా మంత్రుల పర్యటనలు, పథకాల పందేరం !!హుజూరాబాద్ పై కేసీఆర్ ప్రేమ .. రంగంలోకి ఎర్రబెల్లి, ఇంట్రెస్టింగ్ గా మంత్రుల పర్యటనలు, పథకాల పందేరం !!

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఇక కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఆయన తేల్చిచెప్పారు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది అని చెప్పిన రేవంత్ రెడ్డి, 24 గంటల లోపు షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.

అవసరమైతే పార్టీ నుండి బహిష్కరిస్తామని వెల్లడి .. కౌశిక్ రెడ్డిపై టీఆర్ఎస్ ఫైర్

అవసరమైతే పార్టీ నుండి బహిష్కరిస్తామని వెల్లడి .. కౌశిక్ రెడ్డిపై టీఆర్ఎస్ ఫైర్

అవసరమైతే పార్టీ నుండి కౌశిక్ రెడ్డిని బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యవహారంపై హుజూరాబాద్ టిఆర్ఎస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్ టిఆర్ఎస్ నేత కృష్ణ మోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా వస్తుంది అంటూ ప్రశ్నించారు. కావాలని టిఆర్ఎస్ టిక్కెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో హుజురాబాద్ అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు.

Recommended Video

Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu
 రెంటికీ చెడ్డ రేవడిగా కౌశిక్ రెడ్డి పరిస్థితి

రెంటికీ చెడ్డ రేవడిగా కౌశిక్ రెడ్డి పరిస్థితి

ఇక హుజూరాబాద్ నియోజకవర్గం లో కౌశిక్ రెడ్డి పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కౌశిక్ రెడ్డి రెడ్డి పరిస్థితి తాజా పరిణామాలతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారయిందని, రెండు పార్టీలు కౌశిక్ రెడ్డి కి టికెట్ ఇచ్చే అవకాశమే లేదని చర్చ స్థానికంగా సాగుతుంది. కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం టిక్కెట్ ఇచ్చేది లేదని చర్చిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ నేపథ్యంలో ఆయనకు కొత్త చిక్కులు వచ్చి పడినట్లుగా స్థానికంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

English summary
Revanth Reddy reacted to the issue of Congress leader Koushik Reddy, who has become a hot topic in Telangana politics. Revanth Reddy, said his party disciplinary committee had already issued notices to Koushik Reddy. He said he would be expelled from the party if necessary. TRS leaders are also on fire. Kaushik Reddy got into trouble with this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X