ఓటమి భయంతో కేసీఆర్ చెల్లింపులు, రిజిస్ట్రేషన్లు ? రేవంత్ సంచలన ఆరోపణలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక ఎల్లుండి కౌంటింగ్ మాత్రమే మిగిలుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమని తేలిపోయింది. ఇవాళ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ విజయాన్ని నిర్ధారించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి ఖరారు కావడంతో సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతో కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇందులో బిల్లుల చెల్లింపుతో పాటు ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయని రేవంత్ తెలిపారు. వీటిపై సంబంధిత అధికారులకు, ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

tpcc chief revanth reddy sensational allegations on kcr, last minute decisions with fear of defeat

ఓడిపోతానన్న భయంతో కేసీఆర్ రైతు బంధు నిధుల్ని, ఇతర కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్ని మళ్లిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఇవాళ ఆరోపించారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల అసైన్డ్ భూముల్ని తమకు కావాల్సిన వాళ్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. కాబట్టి విజిలెన్స్ విభాగం ఈ లావాదేవీలపై నిఘా పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే తాము కూడా సీఈవో వికాస్ రాజ్ ను కలిసి దీనిపై ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+