వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ ద‌గ్గ‌ర కేసీఆర్ సుపారీ.. యూపీఏను చీల్చేందుకు కుట్ర‌లు : రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై టూర్ ఓ పెద్ద డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య లోపాయకారి ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. పైకి వారి మధ్య విభేదాలున్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నారని మండిపడ్డారు.

Recommended Video

Revanth Reddy Files Second Complaint Against Assam CM | Oneindia Telugu
యూపీఏ చీల్చే కుట్ర

యూపీఏ చీల్చే కుట్ర


అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. యూపీఏ కూటమిని చీల్చి.. కాంగ్రెస్‌ను బలహీనం చేసే ప‌నిలో ఉన్నార‌ని ఆరోపించారు. మూడో సారి నరేంద్రమోదీని ప్రధానిగా చేయడానికి కేసీఆర్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే పార్టీలతో కలిసి యూపీఏ చీల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, కేజ్రీవాల్, ఇతర నేతలను ఎందుకు కేసీఆర్ కలవడం లేదని ప్రశ్నించారు.

 రాఫెల్ కంటే పెద్ద కుంభకోణం సింగ‌రేణిలో..

రాఫెల్ కంటే పెద్ద కుంభకోణం సింగ‌రేణిలో..

రాఫెల్ కంటే అతిపెద్ద కుంభకోణం సింగరేణి సంస్థలో చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సంస్థలో సుమారు రూ. 50 వేల కోట్ల కుంభకోణానికి కుట్ర చేశారని విమర్శించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రాఫెల్ మొదలు కేంద్రమంత్రుల అవినీతి అక్రమాల ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని హెచ్చరించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.

అదానీకి నైని కోల్‌మైన్‌

అదానీకి నైని కోల్‌మైన్‌

ఒడిశాలోని నైని కోల్‌మైన్‌ను అదానీ కంపెనీకి కట్టబెట్టనున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత నాణ్యమైన బొగ్గు కలిగిన నైని కోల్‌మైన్‌లో సొంతంగా ఉత్పత్తి చేయకుండా.. సింగరేణి 25 ఏళ్లకు టెండర్లు పిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఎనిమిదేళ్లుగా కొనసాగించ‌డానికి కార‌ణం .. నైనీ కోల్ మైన్ కొల్లగొట్టడమేనని ఆరోపించారు. గుత్తేతారులకు సింగరేణి సీఎండీ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సింగ‌రేణిలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరాం.. కానీ, ఏమీ చేయలేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పార‌ని రేవంత్ పేర్కొన్నారు.

English summary
Revanth reddy said biggest scandal in Singareni company
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X