కేసీఆర్ దోపిడీకి కేంద్రం సాయం.. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కల్వకుంట కుటుంబం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ దోపిడీకి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోవడంలో కమలం, గులాబీ పార్టీలు కుమ్మక్కైయ్యాయని దుయ్యబట్టారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు రోజుకో కొత్త డ్రామాతో ప్రజల ముందుకు వస్తున్నారని విరుచుకుపడ్డారు.

సింగరేణి టెండర్లలో అవకతవకలు
సింగరేణి బొగ్గు టెండర్ల విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరులకే ఈ కాంట్రాక్టులు దక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలపై తాము కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా పదవిలో తిష్టవేసి కూర్చుకున్న సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఇప్పటి వరకు ఎందుకు తప్పించలేదని నిలదీశారు.

బీజేపీకి కేసీఆర్ నిధులు
సింగరేణి దోపిడీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా వాటా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు . అందుకే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలు, దోపిడీలను మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా డ్రామాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారని రేవంత్ ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు నాటకం ఆడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video


పోరాటాలు బూటకం..
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న పోరాటాలు అంతా బూటకమని రేవంత్ ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలుతో ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేసీఆర్ , అసదుద్దీన్ ఒవైసిలు కలిసి ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వారి ఉచ్చులో పడవద్దని సూచింంచారు. కేసీఆర్ అవినీతి సొమ్ము అంటూ బీజేపీ నేతలు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. పైకి ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా.. లోపల మాత్రం టీఆర్ఎస్ , బీజేపీ నేతలు కలిసి పోయారని విమర్శించారు. సింగరేణిలో చోటుచేసుకున్న దొపిడీపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications