కేసీఆర్ కు చేతకాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంపై ఆధారం - రేవంత్..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తి లో విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కి విద్యుత్తు ఉత్పత్తి చేతకాక, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ కరెంటు కొనుగోలు చేయడం లేదా అని రేవంత్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
కేసీఆర్ పై ఫైర్ : తెలంగాణ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ వైఫల్యాలను రేవంత్ ఎండగడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి అప్పు తీసుకుంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్ కాంగ్రెస్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ ముందు మాపై ఆరోపణలు చేయడం మానేయాలని సూచించారు. ప్రైవేటు కంపెనీల నుండి అత్యధిక ధరకు విద్యుత్‌ను కేసీఆర్ కొనుగోలు చేశారని ఒక ఆరోపణ ఉందన్నారు. రూ.3కి వచ్చే యూనిట్ కరెంట్ ను,కెసిఆర్ దానిని 14 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని రేవంత్ వివరించారు.

గద్దె దించాలి : ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాదర్భార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.
విస్పష్టమైన తీర్పు : ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని.. ఆయన రాచరికం అనుకుంటున్నారని.. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయన్నారు. రూ. 2వేల పెన్షన్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.. ఆయన ఇచ్చే పెన్షన్ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోందని, కేసీఆర్ సవాల్‌లో పస లేదన్నారు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు రూ. ఒక లక్షా 80 వేలు బాకీ ఉన్నారని, 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమేనని రేవంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications