వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ న్యాయపోరాటం... సోమవారం పిటిషన్

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపికపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వాహణపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం చర్చించేందుకు సమావేశమైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక అభ్యర్థుల ఎన్నిక భాద్యతను డీసీసీలకు అప్పగించాలని వారు నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే ఎన్నికలపై సోమవారం హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

ఎమ్మెల్సి ఎన్నికలపై కోర్టుకు

ఎమ్మెల్సి ఎన్నికలపై కోర్టుకు

స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల షెడ్యుల్ పై వివాదం న్యాయస్థానికి చేరుకోనుంది. ఎన్నికలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర్ర ఎన్నికల కమీషన్ తీరుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. కాగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం

కొత్త సభ్యులతోనే ఎన్నికలు నిర్వహించాలి : కాంగ్రెస్

కొత్త సభ్యులతోనే ఎన్నికలు నిర్వహించాలి : కాంగ్రెస్

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సైరైన ఓటరు జాబితా లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్థుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త సభ్యులు మే 27వరకు అందుబాటులోకి వస్తారని ఈనేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికలను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు సాధ్యం కావని ఉత్తమ్ స్పష్టం చేశారు.ఈసికి ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకుని వెంటనే ఎన్నికల ప్రక్రియను నలిపివేయాని అన్నారు. రెండు వారాలు ఎన్నికలు వాయిదా వేసి కొత్తగా ఎన్నికైన ఎంపిటీసీలకు, జెడ్పిటీసీలకు పోలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓటర్ల జాబితా సిద్దమైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.అయితే ఈసీ కాంగ్రెస్ పార్టీ వినతిని పక్కన పెట్టింది.

ఎన్నికల సంఘం ఏమంటుంది ? జూలై 5వరకు పదవి కాలం...

ఎన్నికల సంఘం ఏమంటుంది ? జూలై 5వరకు పదవి కాలం...

అయితే రాష్ట్ర్ర ఎన్నికల సంఘం మాత్రం పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని సీఈవో రజత్ కుమార్ చెబుతున్నారు. తమ వద్ద పాత జాబితా ఉందని అంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థల సభ్యుల పదవి కాలం జూలై అయిదు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే కొత్తగా నిర్వహించే ఎన్నికల ఫలితాలను జూన్ 3న ప్రకటిస్తామని చెబుతోంది. ఈనేపథ్యంలోనే షెడ్యుల్ సైతం విడుదల చేసింది..

మే 31న ఎమ్మెల్సిల ఎన్నికలు

మే 31న ఎమ్మెల్సిల ఎన్నికలు

ఈ నేఫథ్యంలోనే తెలంగాణలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి , నల్గోండ, వరంగల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రజత్ కుమార్ తెలిపారు. కాగా మే 31న పోలింగ్ జరుగుతుండగా మే 14 నామినేషన్లు ధాఖలు చేయనున్నారు. కాగా జూన్ 3 న ఒట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్ ఎమ్మెల్సి కొండా మురలి తన రాజీనామ చేయగా నల్గోండ ,రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సిలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా స్థానాల భర్తికి షెడ్యుల్ విడుదల చేసింది ఈసీ.

సభ్యుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు...

సభ్యుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు...

కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం గాంధి భవన్ ఉత్తమ్ అధ్యక్షతన నేతలు సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపికను ఆయా జిల్లాల డీసీసీలకే అప్పగించారు. కాగా వరంగల్ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సి కొండా మురళీకి కేటాయించాని పార్టీ బావించడంతో పాటు, నల్గోండ స్థానానికి ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణిని ఎంపిక చేసే అవకాశం ఉండగా రంగారెడ్డి నుండి మల్లేశంకు కేటాయిస్తారని తెలుస్తోంది.

English summary
Telangana congress party has decided to go to the court on local bodies mlc elections. and party petition file on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X