Mahesh Kumar Goud: ఆ దాడితో తమ పార్టీకి సంబంధం లేదు.. మహేశ్ కుమార్ గౌడ్..!

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వచ్చింది. అరెకపూడి గాంధీకి తానే వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానని.. కౌశిక్ రెడ్డి అన్నారు. దీనికి స్పందన తానే కౌశిక్ ఇంటికి వస్తున్నట్లు గాంధీ సవాల్ విసిరారు. దీని ప్రతిగా.. రా కండువా కప్పుతా అంటూ కౌశిక్ మాట్లాడారు. కౌశిక్ రెడ్డి బ్రోకర్ అని గాంధీ అంటే.. అరెకపూడి గాంధే బ్రోకర్ అని పాడి అన్నాడు. మొగోడివైతే ఇంటికి రావాలని సవాల్ విశారు.

దీంతో అరెకపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డికి వచ్చారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అరెకపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి సర్దుమణిగింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దగ్గరుండి పోలీసులు దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

TPCC president Mahesh Kumar Goud said that Congress has nothing to do with the attack on Kaushik Reddy s house

ఇదే విషయమై ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమని.. కానీ మాట్లాడే భాష్ చాలా ముఖ్యమని అన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ఎవరు కూడా కూడా సమర్థించరని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారితో తమ పార్టీ సంబంధం లేదన్నారు. నిబంధనల మేరకే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చినట్లు పేర్కొన్నారు. గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ సభ్యుడేనని పేర్కొన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఆయన పార్టీ పెద్దలను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటేడ్ పదవులుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+