Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kamareddy: కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!

సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈసారి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేయనున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ తో పాటు కామారెడ్డి లో సీఎం కేసీఆర్ పై బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ గట్టిగా ఉండనుంది.

స్థానికంగా ఎంతో కాలంగా పని చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ కేసీఆర్ పై పోటీకి విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ ను కొండగల్ తో పాటు కామారెడ్డిలో కూడా బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా జాబితా విడుదలైతేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో వైరు రెండో జాబితా పై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. టికెట్ల కేటాయింపులో హస్తం అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎల్లారెడ్డి, ఎల్‌బీ నగర్, మిర్యాలగూడ, వైరా, ఇల్లందు, బాన్సువాడ, తుంగతుర్తి, భువనగిరి, మక్తల్, హుస్నాబాద్, హుజూరాబాద్, భోథ్ నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఎల్‌బీ నగర్ నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ టికెట్ ఆశిస్తుండగా, హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ మాజీ వర్కింగ్ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ టికెట్‌ కోరుతున్నారు.

TPCC president Revanth Reddy is likely to contest against CM KCR in Kamareddy

తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ గౌడ్, మధు యాష్కీ గౌడ్ కీలకంగా పనిచేశారు. మొదటి జాబితాలో వారికి టికెట్ కాన్ఫమ్ కాకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు, హుస్నాబాద్‌, పాలేరు, చెన్నూరు స్థానాల్లో వామపక్షాలు- కాంగ్రెస్‌ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతోన్నాయి. రెండో జాబితాలో జడ్చర్ల నుంచి అనిరుధ్‌రెడ్డి\ ఎర్రశేఖర్‌ పోటీ పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి యొన్నం శ్రీనివాస్‌రెడ్డి\ ఒబెదుల్లా కొత్వాల్‌, దేవరక్రద నుంచి జి.మధుసుధన్‌రెడ్డి\కాటం ప్రదీప్‌గౌడ్‌, మక్తల్‌ నుంచి శ్రీహరి ముదిరాజ్‌\కొత్తకోట సిద్ధార్థ్‌రెడ్డి, నారాయణపేట నుంచి కుంభం శివకుమార్‌\ఎర్ర శేఖర్‌ పోటీ పడుతున్నారు.

వనపర్తి నుంచి చిన్నారెడ్డి\మేఘారెడ్డి, దేవరకొండ-బాలు నాయక్‌, భువనగిరి- కుంభం అనిల్‌, సూర్యాపేట-పటేల్‌ రమేష్‌/ ఆర్‌.దామోదరరెడ్డి, మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి?, తుంగతుర్తి నుంచి అద్ధంకి దయాకర్\ ప్రీతం\వడ్డేపల్లి రవి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇల్లందు నుంచి కోరం కనకయ్య\ప్రవీణ్‌ నాయక్‌ పోటీ పడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+