పోలీసులు పట్టించుకోలేదు, తగిన బుద్ది చెబుతాం: ఉత్తమ్
హైదరాబాద్: నల్గొండ మున్సిఫల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్యను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకొన్నారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని భావిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు సంబంధించి చోటు చేసుకొన్న పరిణామాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం నాడు హైద్రాబాద్ లో స్పందించారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు అమానుషమని మండిపడ్డారు.

శ్రీనివాస్‌కు ప్రాణహని ఉందని రక్షణ కల్పించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తగిన బుద్ది చెబుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
శ్రీనివాస్ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం నల్లగొండకు వెళ్లనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications