Congress: రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన విజయ్ కుమార్..
కాంగ్రెస్ అసమ్మతి జ్వాల కొనసాగుతోంది. తాజాగా టికెట్ రాని నేతల అనుచరులు గాంధీభవన్ లో ఆందోళనకు దిగారు.మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ రాని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ ముందు నిరసన తెలిపారు. బచావో బచావో.. కాంగ్రెస్ బచావో.. అంటూ నినాదాలు చేశారు. సర్వేల ఆధారంగా హరివర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఇందిరా భవన్ లో ఉండడం తో ఇందిరభవన్ ముందు కూడా హరివర్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన చేశారు. టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు చేశారు.

నాడు ఓటుకు నోటు , నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు చేశారు. 65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా... పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు.
వెంటనే రేవంత్ రెడ్డి ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ను డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్ట్ ను ప్రక్షాళన చేయాలన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని విజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ ఉప్పల్ నియోజక వర్గం బి-బ్లాక్ అధ్యక్షుడు, సీనియర్ నేత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. పార్టీని నాశనం చేయాలనే రేవంత్ కంకణం కట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఉప్పల్ సెగ్మెంట్ నుంచి సోమశేఖర్ రెడ్డి పార్టీ టికెట్‌ను ఆశించారు. టికెట్ రాకపోయేసారికి ఆరోపణలు చేశారు. అయితే టికెట్ల ప్రకటన తర్వాత అసమ్మతి కామన్ అని కాంగ్రెస్ అగ్ర నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications