మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మృతి: విచారణలో షాకింగ్ విషయాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ మృతిపై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో ఆసక్తికర, షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
చదవండి: నారాయణ కొడుకు స్పీడ్‌పై బెంజ్ ప్రతినిధుల ఆశ్చర్యం
నిషిత్ నారాయణ కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అతి వేగం కారణంగానే అతను మృతి చెందినట్లు ట్రాఫిక్ పోలీసుల విచారణలో వెల్లడయింది.

నిమిషానికి 2.42 కిలో మీటర్ల వేగం
వారు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంపై పరిశీలన చేశారు. అనంతరం వారు వివరాలు తెలిపారు. నిషిత్ నారాయణ కారు నిమిషానికి రూ.2.42 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించిందని గుర్తించినట్లు తెలిపారు.

గంటకు 146 కిలో మీటర్ల వేగం
నిషిత్ నారాయణ, ఆయన స్నేహితుడు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలో కారు గంటకు 146 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.

రెండు పిల్లర్ల మధ్య 0.56 మైక్రో సెకన్ల వేగంతో..
నిషిత్ నారాయణ కారు వేగం అతివేగంగా ఉందని పోలీసులు గుర్తించారు. రెండు పిల్లర్ల మధ్య 75 అడుగుల దూరం ఉంది. ఈ దూరాన్ని కేవలం 0.56 మైక్రో సెకన్లలో ప్రయాణించిందని తెలిపారు.

సెకనుకు 4 ప్రేమ్‌లు.. కానీ
సిసి కెమెరాల్లో సెకనుకు 4 ప్రేమ్‌లు మాత్రమే రికార్డ్ అవుతాయని పోలీసులు తెలిపారు. కానీ నిషిత్ రోడ్డు ప్రమాదంలో సెకనుకు 24 ప్రేమ్‌లు రికార్డ్ అయినట్లు గుర్తించారు. అతి వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications