మినీ బస్సు ఢీకొని ట్రాఫిక్ ఎస్సై మృతి (పిక్చర్)
హైదరాబాద్: రోడ్డు దాటుతున్న ట్రాఫిక్ ఎస్సైని మినీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయిదాస్ (54) నేరెడ్‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సైగా శుక్రవారం సాయిదాస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న సాయిదాస్ రోడ్డును దాటుతుండగా ఎపి 10 డబ్ల్యు 5265 నంబరు గల మినీ బస్సు అతి వేగంగా దూసుకువచ్చి ఎస్సైని ఢీకొట్టింది.
తీవ్ర గాయాలకు గురైన సాయిదాస్‌ను స్థానికంగా గల మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ డిసిపి ప్రమోద్‌కుమార్, పేట్‌బషీరాబాద్ ఎసిపి శ్రీనివాస్‌రావు, సిఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఐ వేణుగోపాల స్వామి అక్కడికి చేరుకున్నారు. దుండిగల్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications