విషాదం .. మహబూబాబాద్ లో ఆటో ట్రాలీ బోల్తాపడి 36 మందికి తీవ్ర గాయాలు

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . ఆటో ట్రాలీ టైర్ పేలటంతో జరిగిన ప్రమాదంలో ట్రాలీలో ఉన్న 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు . ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

క్షతగాత్రులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన 36 మంది గిరిజనులు తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఒక ఆటో ట్రాలీని మాట్లాడుకుని 36 మంది ఆటో ట్రాలీలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు బయలుదేరారు. నామాలపాడు అటవీప్రాంతానికి రాగానే ఆటో ట్రాలీ టైర్ పేలిపోయింది . వేగంగా వాహనం నడుపుతున్న సమయంలో టైర్ పగలటంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

Tragedy.. 36 Injured in a road accident at Mahabubabad

దీంతో ఆటో ట్రాలీలో ప్రయాణం చేస్తున్న 36 మందికి తీవ్ర గాయాలుయ్యాయి. చాలా మంది తలకు తీవ్ర గాయమైంది . ఈ ఘటనలో ఒక చిన్నారి ఎడమచెయ్యి విరిగిపోయింది . ప్రస్తుతం వీరంతా మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+