భద్రాచలంలో ఘోర విషాదం.. కుప్పకూలిన భవనం, ఏడుగురు మృతి

తెలంగాణలోని భద్రాచలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్తి చెందగా.. పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. రామాలయం లోని సలీం టీ స్టాల్ ఎదురుగా ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు.

ఈ దుర్ఘటనలో ఆరు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోగా.. నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి

tragedy-in-bhadrachalam-building-collapses-seven-dead

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన సమయంలో ఎంత మంది పనిచేస్తున్నారు ? శిథిలాల కింద ఎంత మంది కార్మికులు చిక్కుకున్నారు ?? ప్రమాదం ఎలా జరిగింది..? భవనం కూలిపోవటానికి కారణాలేంటీ..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఇంటి య‌జ‌మాని శ్రీప‌తి శ్రీనివాస్ రావు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఆయ‌న కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+