Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూఎస్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీలు దుర్మరణం

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని బర్మింగ్‌హామ్ ప్రాంతంలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరణించిన ఇద్దరూ హైదరాబాద్ వాసులే కావడం మరింత విచారకరం.

మరణించిన వారిలో మేడ్చ‌ల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజారెడ్డితో పాటు, కూకట్‌ప‌ల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మొత్తం పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. వారంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం.

Tragic Fire in the US Two Hyderabad Students Killed in Birmingham Apartment Blaze

ఈ అగ్నిప్రమాదం హఠాత్తుగా చెలరేగడంతో, అపార్ట్‌మెంట్‌లో ఉన్న విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. పొగ కారణంగా ఊపిరాడక సహాయం కోసం వారు పెద్దగా కేకలు వేశారు. విద్యార్థుల కేకల నేపథ్యంలో స్థానికుల నుంచి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. అయితే, వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఉడుముల సహజారెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువకులు ఇలా అగ్నిప్రమాదంలో మరణించడంపై బర్మింగ్‌హామ్‌లోని తెలుగు కమ్యూనిటీతో పాటు, హైదరాబాద్‌లోని మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అధికారులు, భారత ఎంబసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్ యువతి సహజారెడ్డి మృతి
పోచారం పరిధిలోని చౌదరిగూడకు చెందిన సహజారెడ్డి అమెరికాలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సహజారెడ్డి అలబామా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. సహజ తండ్రి ఉడుముల జయకర్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కూతురు అయిన సహజ అమెరికాలో ఎంఎస్ చదువుతోంది. సహజ మరణంతో ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదం అలుముకుంది. విద్య కోసం అమెరికా వెళ్లిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో సహజారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నిద్రలో విషాదం
సహజారెడ్డి చదువు దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం ఆమెను బలితీసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్‌ పక్కనున్న మరో భవనం నుంచి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో నిద్రలో ఉన్న సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ వీడియో కాల్‌లో మాట్లాడే తమ గారాల కూతురు ఇక లేదన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాద వార్తతో శ్రీనివాస కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

భారత ఎంబసీ స్పందన
సహజారెడ్డి మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన ఎంబసీ, ఆ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సాయం అందించి, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+