అయ్యో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం..
గోదావరి ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నిత్యం వేలాదిమంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సాధారణ సమయంలోనే ఈ రైలులో సీటు దొరకదు. ఇక పండగలు, సెలవు రోజుల్లో అయితే ఊపిరి కూడా ఆడనంతగా జనం ఎక్కేస్తారు. సీటు సంగతి దేవుడెరుగు.. ఈ మూల ఆ మూల అని కాకుండా బాత్ రూమ్ లో కూడా డజన్ల మంది నిల్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాలకు వెళ్లే చాలా రైళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. పండగల సమయంలో అధిక రద్దీ కారణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి ఉంది. తాజాగా గోదావరి ఎక్స్ ప్రెస్ లో జరిగిన దారుణమైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
దేశవ్యాప్తంగా రైళ్లలో నిత్యం రద్దీగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అనేక రైళ్లు నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. సాధారణంగా రైల్వేలో ప్రయాణికులకు భద్రత ఉంటుంది. రైళ్లలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రయాణికులకు అనారోగ్యం అనిపిస్తే సిబ్బందిని సంప్రదించవచ్చు. అదే ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటనే రైలును నిలిపివేస్తారు. తాజాగా గోదావరి ఎక్స్ ప్రెస్ లో అదే జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో రైలును కాజీపేట స్టేషన్ లో సుమారు గంటపాటు నిలిపివేశారు.

ఆ వ్యక్తికి ప్రయాణ మార్గంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రైల్వే సిబ్బంది అలెర్ట్ అయింది. కాజీపేట స్టేషన్ లో ఆ వ్యక్తికి వైద్య చికిత్స అందించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. సమాచారం అందిన వెంటనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఆ వ్యక్తికి పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. మృతదేహాన్ని తమకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే రైల్వే డాక్టర్లు పూర్తిగా పరీక్షించిన తర్వాతే బాడీని ఇస్తామని చెప్పడంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇరువురు మధ్య ఆందోళన పరిస్థితి, గందరగోళం నేపథ్యంలో రైలును గంటపాటు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications