మెరికల్లాంటి పోలీసులు సిద్ధం.ఇజ్రాయిల్ దేశ పద్దతిలో యుధ్ద తంత్రకళ
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మెరికల్లాంటి పోలీసులను సిద్ధం చేస్తున్నామని సీపీ వి.బి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు పోలీసులందరికీ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.
కరీంనగర్: అసాంఘిక శక్తులను వివిధ పద్ధతుల్లో అదుపులోకి తీసుకోవడంతో పాటు, దేశభద్రతకు భంగం కలిగించే శక్తుల కదలికల నియంత్రణకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మెరికల్లాంటి పోలీసులను సిద్ధం చేస్తున్నామని సీపీ వి.బి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు పోలీసులందరికీ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.
కమిషనరేట్‌లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇజ్రాయిల్ దేశ సైనికులు అవలంభించే యుద్ధతంత్ర కళ క్రేవ్‌మగాల్లో భాగంగా డిఫెన్సివ్ పోలీస్ టాక్టికల్ ట్రైనింగ్ బుధవారం ముగిసింది. 20 మంది పోలీసులను ఎంపిక చేసి, సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీపీటీసీ)లో 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.

ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిక్షణను 15 రోజుల పాటు కొనసాగిస్తూ అంచెలవారీగా నిర్వహిస్తామన్నారు. చురుకుగా ఉన్న పోలీసులను ఈ శిక్షణకు ఎంపిక చేస్తామని, జనసమూహం ఎక్కువగా ఉండే, అనుమానిత ప్రాంతాల్లో శిక్షణ పొందిన పోలీసుల సేవలను వినియోగిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications