వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమద్రోహి కేసీఆర్.. వీడియోలతో కాంగ్రెస్ టార్గెట్.. రేవంత్ రెడ్డి విజువల్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వంటి దూకుడు ఉన్న నాయకుడు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటలేకపోతుంది. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తాము ఉన్నామని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాలా పోరాడుతోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందని చూపించే ప్రయత్నం చేస్తుంది.

ప్రజా క్షేత్రంలోకి వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీకి రోజుకో కొత్త వ్యూహం

ప్రజా క్షేత్రంలోకి వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీకి రోజుకో కొత్త వ్యూహం

అయితే వరుస ఓటములతో, ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడం కోసం ఎన్ని వ్యూహాలు రచించినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు గానే మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేసే నాయకులు లేక కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది.

ఉద్యమద్రోహి కేసీఆర్ అంటూ ఆ వీడియో లతో టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్

ఇక వచ్చే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని తాజాగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ఉద్యమ ద్రోహి కెసిఆర్ హ్యాష్ టాగ్ తో వీడియోలను నెట్టింట పెట్టి ప్రజలను ఆలోచించేలా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలపై ఫోకస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ దాదాపు పది వీడియోలను పోస్ట్ చేసి రాష్ట్రంలో అనేక సమస్యలపై కెసిఆర్ సర్కారును నిలదీసింది.

 బాలుర హాస్టల్స్ లో విద్యార్థుల దుస్థితిపై కేసీఆర్ సర్కార్ కు ప్రశ్న

బాలుర హాస్టల్స్ లో విద్యార్థుల దుస్థితిపై కేసీఆర్ సర్కార్ కు ప్రశ్న

తాజాగా ఫోకస్ 10 అంటూ రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ బడుల దుస్థితిపై అందులో విద్యార్థులు పడుతున్న అవస్థలపై, ఏళ్ళు గడుస్తున్నా అవే కన్నీటి కథలు అంటూ పేర్కొంది. జమ్మికుంట ప్రభుత్వ బాలుర పాఠశాల, మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలలో ఎముకలు కొరికే చలిలో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేయవలసి వస్తుందని, శీతాకాలంలో చలి పెరిగిపోతున్నా కనీసం దుప్పట్లు లేని పరిస్థితులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయని, హాస్టల్లో విద్యార్థులు ఏకరువు పెట్టిన సమస్యలను జనం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

పైలం బిడ్డో అని పిల్లల్ని బడికి పంపే పరిస్థితులు.. రేవంత్ రెడ్డి ట్వీట్

పైలం బిడ్డో అని పిల్లల్ని బడికి పంపే పరిస్థితులు.. రేవంత్ రెడ్డి ట్వీట్

ఈ చిన్నారులు సమస్యలకు అంతమెప్పుడు అంటూ ప్రశ్నించారు. ఈ దగాకోరు సర్కారు కళ్లు తెరిచేది ఎప్పుడూ అంటూ నిలదీశారు. ఓ అసమర్థ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణలో విద్యార్థులకు ఇదేం దుస్థితి అంటూ నిప్పులు చెరిగారు. ఎముకలు కొరికే చలిలో నిద్రలేమి రాత్రులు.. తట్టుకోలేక వణికిపోతున్న చిన్నారులు. దొర చేతిలో దగా పడ్డ బడి పిల్లల బతుకులు. పైలం బిడ్డో అని పిల్లల్ని బడికి పంపే పరిస్థితులు అంటూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

 గ్రౌండ్ లెవల్ కు వెళ్లి వాస్తవ పరిస్థితులు చూపించే వీడియోలతో.. సక్సెస్ అవుతారా?

గ్రౌండ్ లెవల్ కు వెళ్లి వాస్తవ పరిస్థితులు చూపించే వీడియోలతో.. సక్సెస్ అవుతారా?


గతంలో ధరణి పోర్టల్ సమస్యలు, బాలికల పాఠశాలలో, కళాశాలలో మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితులు ఇలా అనేక అంశాలను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఇక రాష్ట్రంలోని అనేక సమస్యల పైన ఫోకస్ చేస్తూ కెసిఆర్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ఉద్యమ ద్రోహి అని చెప్పే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Calling KCR a traitor to the movement, Congress is targeting KCR with videos showing many problems in the state at the field level. It remains to be seen whether the visual sketch of Revanth Reddy will work out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X