గిరిజన బాలికల హత్య మిస్టరీ: ప్రియాంకతో ఆటో డ్రైవర్ సినిమా చూశాడు
వరంగల్: వరంగల్ జిల్లాలో కంబాలకుంట తండా గిరిజన బాలికలు బానోతు భూమిక, బానోతు ప్రియాంక మరణాల మిస్టరీ వీడడం లేదు. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి ఓ ఆటో డ్రైవర్ పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నారాయణపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెరిపోతుల రాము నవంబర్ 10వ తేదీన రోజువారీ ఫైనాన్స్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాడు. అంతుకు ముందు రోజు దీపావళి సెలవు కావడంతో ప్రియాంక అతని ఇంటికి వచ్చింది.
రాము, ప్రియాంక కలిసి నవంబర్ 22వ తేదీ వరకు రెండు, మూడు సార్లు నెక్కొండ సినిమా థియేటర్‌కు వచ్చిన ఓ విద్యార్థిని చెప్పిందంటూ స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. 23వ తేదీన వాళ్లు మరోసారి నెక్కొండలో కలుసుకున్నట్లు తెలుస్తోంది.

నవంబర్ 11వ తేదీన నుంచి 22వ తేదీ వరకు రోజుకు రూ.150 చొప్పున గిరిగిరి డబ్బులు చెల్లించిన రాము 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీన్ని బట్టి రాము ప్రియాంకతో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి.
23వ తేదీన సినిమాకు వెళ్లినవారిలో రాము ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా, భూమిక కోసం రాముతో కలిసి మూడు వెంకన్న అనే వ్యక్తి వచ్చేవాడని హాస్టల్ విద్యార్థిని చెప్పినట్లు సమాచారం. 10 నెలల క్రితం రాముకు పెళ్లయింది. రెండు నెలలకే భార్యతో గొడవ పెట్టుకుని కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపినట్లు తెలుస్తోంది.
నవంబర్ 25వ తేదీన ప్రియాంక, భూమిక తప్పిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు రాము, వెంకన్న కూడా ఊళ్లో లేరు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రామును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
ప్రియాంకతో కలిసి తాను మూడుసార్లు సినిమా చూశానని రాము పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. అయితే ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉందో తనకు తెలియదని అతను చెప్పాడని అంటున్నారు. దాంతో రామును పోలీసులు వదిలేశారు. అప్పటి నుంచి అతడు స్వగ్రామాన్ని వలిదేసి మరో ఊళ్లో భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications