సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రియల్ హీరో సోనూ సూద్‌కు గుడి కట్టారు: తెలంగాణలోనే, తమ అదృష్టమంటూ గ్రామవాసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దానంలో కలియుగ కర్ణుడిలా పేరు తెచ్చుకున్న బాలీవుడ్, టాలీవుడ్ రీల్ విలన్.. నిజ జీవితంలో రియల్ హీరో సోనూ సూద్‌కు దేశ ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన ద్వారా సాయం పొందిన ప్రతి ఒక్కరూ ఆయనను తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు. ఈ రియల్ హీరోకు తెలంగాణలో గుడికట్టారు.

సోనూ సూద్ విగ్రహం..

సోనూ సూద్ విగ్రహం..

సిద్దిపేట జిల్లాలోని దుబ్బా తండాలో గిరిజన ప్రజలు సోనూ సూద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఆలయాన్ని నిర్మించారు. కరోనా లాక్‌డౌన్ కష్టకాలంలో లక్షలాది మందికి సాయం చేసి కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయనకు తాము ఆలయం నిర్మించి ఆరాధిస్తున్నామని అక్కడి ప్రజుల చెబుతున్నారు. ఆదివారం(నవంబర్ 20) నాడు సోనూ సూద్ విగ్రహాన్ని స్థానికుల సమక్షంలో ఆలయంలో ప్రతిష్టించారు. కాగా, ఈ గుడి నిర్మాణానికి స్థానికులతోపాటు సిద్దిపేట జిల్లా అధికారులు కూడా తమవంతుగా సాయం చేశారు.

అందుకే సోనూ సూద్‌కు గుడి కట్టాం..

అందుకే సోనూ సూద్‌కు గుడి కట్టాం..

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సభ్యుడు గిరి కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో బాధపడుతున్న ప్రజల కోసం సోనూ సూద్ శక్తికి మించిన సాయం అందించారని ప్రశంసించారు. సోనూ సూద్‌ గుడి నిర్మాణంలో భాగస్వాములైన రమేష్ కుమార్ కుమార్ మాట్లాడుతూ.. సోనూ సూద్ తన మంచి పనుల ద్వారా దేవుడి స్థానాన్ని పొందినందుకు ఆయనకు గుడి కట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ఆయనకు గుడికట్టామని చెప్పారు. సోనూ సూద్ విగ్రహాన్నితయారు చేయడం తన అదృష్టమని విగ్రహ శిల్పి మధుసూదన్ తెలిపారు.

కరోనా కష్ట కాలంలో దేవుడిలానే సోనూ సూద్

కరోనా కష్ట కాలంలో దేవుడిలానే సోనూ సూద్

కాగా, కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆపద్భాంధవుడిలా సోనూ సూద్ ఆదుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎవరైనా సాయం కావాలంటూ ఒక్క ట్వీట్ చేస్తే చాలా నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను రియల్ హీరో అంటూ దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఎస్టీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును కూడా అందజేయడం గమనార్హం. అయితే, తాను దేవుడిని కాదని.. మీలో ఒకడినేనని సోనూ సూద్ ఎంతో వినమ్రంగా చెబుతుండటం గమనార్హం.

English summary
The villagers of Chelime Tanda in Dhoolimitta mandal of Siddipet district have begun revering Sonu Sood after reading about his acts of kindness during the pandemic in helping the migrant labour walking back home in different states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X