చందానగర్ ట్రిపుల్ మర్డర్స్: ఆరోజు ఏం జరిగింది? నిందితుడు మధు ఏం చెప్పాడు?
హైదరాబాద్: నగర శివారు చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి గౌతమినగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యల మిస్టరీ వీడింది. అపర్ణ, అమె తల్లి జయలక్ష్మి, కూతురు కార్తికేయిని హత్య చేసింది తానేనని అపర్ణ ప్రియుడు మధు పోలీసుల ముందు అంగీకరించాడు.
అపర్ణ తలపై బరువైన వస్తువుతో మోది చంపగా... అమె మృతదేహం వంటగదిలో పడి ఉంది. జయలక్ష్మీ, కార్తికేయ మృతదేహాలు పడక గదిలో మంచంపై నిద్రపోతున్న స్థితిలో ఉన్నాయి. వీరిని గంతు నులిమి చంపినట్లు నిందితుడు మధు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది.

ప్రేమ వివాహం
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అపర్ణ పదేళ్ల క్రితం నగరానికి వచ్చింది. కూకట్‌పల్లిలో ఉండే మధును ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్లుగా మధుతో బేదాభిప్రాయాలు రావడంతో భర్తకు దూరంగా ఉంటోంది. కాగా, మధుకు ఇది వరకే వివాహమైంది.

దుర్వాసన రావడంతో వెలుగులోకి
చందానగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో పనిచేస్తున్న అపర్ణ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. రెండు రోజులుగా అపర్ణ నివాసముండే ప్లాట్ తాళం వేసి ఉండటం, లోపలి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు కిటికి తెరిచి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అపర్ణకు చివరి కాల్
శుక్రవారం రాత్రి పదకొండున్నరకు అపర్ణ ఫోన్‌కి చివరి కాల్ వచ్చిందని, అదే రోజు రాత్రి హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ పరిశీలించారు. హత్యకు సంబంధించి వివిధ ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది.

అనుమానం.. విసిగిస్తున్నారనే..
కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, అపర్ణ ప్రియుడు మధు పలు కీలక విషయాలను వెల్లడించాడు. అపర్ణతో పదేళ్లుగా సంబంధం ఉందని, ఆమె తనను విసిగిస్తుండటం, మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతోనే తాను ఆమెను హత్య చేసినట్లు చెప్పాడు.

ముగ్గురినీ చంపేశాను: మధు
అపర్ణతోపాటు ఆమె తల్లిని, కూతురును కూడా గొంతునులిమి చంపినట్లు అంగీకరించాడు. అపర్ణను గట్టిగా బలమైన వస్తువుతో మోది, గోడకేసి బాదడంతో చనిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలతిపాడు. కాగా, నిందితుడ్ని పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications