సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంచాయతీ స్ఫూర్తి : కారు హవా.. పరిషత్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. ఎన్నికలు ఏవైనా గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కంటిన్యూ చేస్తూ పంచాయతీ పోరులో గులాబీ వనం వికసించింది. ఇప్పుడు కూడా అదే హవాను కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ నేతలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను అత్యధికంగా ఏకగ్రీవం చేసేలా పావులు కదుపుతున్నారు. తొలివిడతలో భాగంగా పలుచోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పరిషత్ ఎన్నికల్లో గులాబీ దళం బోణీ కొట్టినట్లైంది.

<strong>ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం</strong>ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం

ఏకగ్రీవ మంత్రాంగం

ఏకగ్రీవ మంత్రాంగం

జనవరిలో జరిగిన పంచాయతీ పోరు టీఆర్ఎస్ కు పట్టం కట్టింది. అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకోవడం విశేషం. అదలావుంటే రాష్ట్రవ్యాప్తంగా 2,130 సర్పంచ్ పీఠాలను ఏకగ్రీవం చేసుకోవడం ఆ పార్టీ బలమెంటో నిరూపిస్తోంది. అదే స్ఫూర్తితో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

పరిషత్ ఎలక్షన్లలో భాగంగా తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఆదివారం నాటితో ముగిసింది. దాంతో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 2 జడ్పీటీసీ స్థానాలు, పదుల సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.

రెండు జడ్పీటీసీలతో బోణి

రెండు జడ్పీటీసీలతో బోణి

జడ్పీటీసీ తొలివిడత ఎన్నికల్లో భాగంగా రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు టీఆర్ఎస్ నేతలు. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లోని మాక్లూరు జెడ్పీటీసీగా దాదన్నగారి విఠల్ రావు ఏకగ్రీవమయ్యారు. మండలాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విఠల్ రావుకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అటు జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు జడ్పీటీసీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి బొడ్డు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

45 స్థానాలకు 10 ఏకగ్రీవం

45 స్థానాలకు 10 ఏకగ్రీవం

పరిషత్ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ కు మంచి బోణీ తగిలినట్లైంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా అత్యధిక ఏకగ్రీవాలు నమోదైంది ఇక్కడే. మొదటి దశలో 45 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. దాదాపు 25 శాతంతో 10 స్థానాలను గులాబీ గూటిలో జమచేశారు టీఆర్ఎస్ నేతలు. ఖానాపూర్, రాజ్‌గోపాల్‌పేట, పాలమాకుల, మేడిపల్లి, గోనెపల్లి, చిన్నకోడూరు-1, చింతమడక, తోర్నాల, గుర్రాలగొంది, ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

తొలివిడతలో ఏకగ్రీవమైన జడ్పీటీసీలు :

తొలివిడతలో ఏకగ్రీవమైన జడ్పీటీసీలు :

S.No ZPTC Area District Candidate
1 మాక్లూరు నిజామాబాద్ దాదన్నగారి విఠల్ రావు
2 వెల్గటూరు జగిత్యాల బొడ్డు సుధారాణి

తొలివిడతలో ఏకగ్రీవమైన ఎంపీటీసీలు :

తొలివిడతలో ఏకగ్రీవమైన ఎంపీటీసీలు :

దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీగా ఏల్పుల స్వామి ఏకగ్రీవమయ్యారు.


S.No. MPTC Area Mandal Distritct Candidate
1 ఖానాపూర్ నంగునూరు సిద్దిపేట జాప అరుణ
2 రాజ్‌గోపాల్‌పేట నంగునూరు సిద్దిపేట జాజుల సుమలత
3 పాలమాకుల నంగునూరు సిద్దిపేట ఏటి తులసి
4 మేడిపల్లి చిన్నకోడూరు సిద్దిపేట కూర మాణిక్యరెడ్డి
5 గోనెపల్లి చిన్నకోడూరు సిద్దిపేట బండి పద్మ
6 చిన్నకోడూరు-1 చిన్నకోడూరు సిద్దిపేట పానుగంటి శారద
7 చింతమడక సిద్దిపేట రూరల్ సిద్దిపేట రాందేని జ్యోతి
8 తోర్నాల సిద్దిపేట రూరల్ సిద్దిపేట శేరుపల్లి యాదయ్య
9 గుర్రాలగొంది నారాయణపేట సిద్దిపేట ఆకుల హరీశ్
10 ఎల్లారెడ్డిపేట తొగుట సిద్దిపేట ఏల్పుల స్వామి
11 పరిమండల్ మామడ నిర్మల్ రాథోడ్ అమృత
12 కొత్తపల్లి మాక్లూర్ నిజామాబాద్ పురుషోత్తంరావు
13 మాదాపూర్ మాక్లూర్ నిజామాబాద్ బొంతల లలిత
14 దూస్‌గాం డిచ్‌పల్లి నిజామాబాద్ గద్దె భూమన్న
15 చంద్రాయన్‌పల్లి ఇందల్వాయి నిజామాబాద్ రమేశ్‌నాయక్
16 పాతగూడూరు వెల్గటూర్ జగిత్యాల లక్కాకుల రాణి
17 ఆరెపల్లి ధర్మపురి జగిత్యాల కుంబాల కవిత
18 కమలాపూర్ ధర్మపురి జగిత్యాల గడ్డం మహిపాల్‌రెడ్డి
19 వల్లభి-1 ముదిగొండ ఖమ్మం వడ్డెపూడి రోజానీ
20 వల్లభి-2 ముదిగొండ ఖమ్మం బిచ్చాల భిక్షం
21 కోయగూడెం టేకుపల్లి భద్రాద్రి జార సంధ్య
22 అశ్వాపురం -1 టేకుపల్లి భద్రాద్రి కందుల దుర్గా భవాని
23 మల్లంపల్లి దుగ్గొండి వరంగల్ రూరల్ పల్లాటి జైపాల్‌రెడ్డి
24 సీతారాంపురం దేవరుప్పుల జనగామ బస్వ సావిత్రి
25 మొండ్రాయి కొడకండ్ల జనగామ ధరావత్ జ్యోతి
26 గగ్గలపల్లి నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి
27 గంట్రావుపల్లి నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ దీపిక
28 గోప్లాపురం పెంట్లవెల్లి నాగర్‌కర్నూల్ లగుసాని శిరీష

English summary
TRS party candidates unanimous in MPTC, ZPTC elections. 2 ZPTC and 29 MPTC's were elected as unanimous while single nominations filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X