రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు: చిక్కులతో వెనక్కి తగ్గిన కెసిఆర్?

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు చిక్కిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై అనర్హత వేటుపై అచితూచి అడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు విషయాన్ని పక్కన పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అడిగితే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సభ్యులు మూకుమ్మడిగా ఎదురు దాడి చేసే అవకాశాలున్నాయి. తమ పార్టీల నుంచి టిఆర్ఎస్‌లో చేరిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చి రాజకీయంగా ఎదుర్కునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పైగా, రేవంత్ రెడ్డి వ్యవహారం కోర్టు ఉన్నందున స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశం లేదని అంటున్నారు. కేసులో కోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడాలని టిఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో బలమైన ఆధారాలు ఉండడం వల్ల రేవంత్ రెడ్డి దోషిగా తేలడం ఖాయమని, కోర్టు దోషిగా తేలిస్తే దానంతటదే రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వం రద్దవుతుందని టిఆర్ఎస్ అనుకుంటోంది. అంతవరకు వేచి ఉండడమే మంచిదని టిఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు.

 TRS cautious over Revanth's disqualification

టిఆర్ఎస్‌లో చేరిన తమ సభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు, టిడిపిలు స్పీకర్‌ను కోరాయి. అయితే, ఆయన నిర్ణయం తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. ఈ స్థితిలో ఈ రెండు పార్టీలు కూడా కోర్టును ఆశ్రయించాయి. దాంతో ఆ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్‌కు సూచించింది.

జులైలో లేదా ఆగస్టులో జరిగే శాసనసభ సమావేశాల్లో రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌ను ముందుకు తేవాలని టిఆర్ఎస్ ముందు అనుకుంది. అయితే, సమావేశాల నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసి వదిలేస్తే సరిపోతుందని ఇప్పుడు భావిస్తోంది.

తమ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తీగెల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై అనర్హత వేటు వేయాలని టిడిపి స్పీకర్‌ను కోరింది. అలాగే, కాలె యాదయ్య, డిఎస్ రెడ్యా నాయక్, జి. విఠల్ రెడ్డి, కోరం కనకయ్యలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెసు పార్టీ కోరింది. తమ పార్టీ తరఫున గెలిచి టిఆర్ఎస్‌లో చేరిన మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. ప్రతిపక్షాల విజ్ఞప్తులు పెండింగులో ఉన్న స్థితిలో రేవంత్ రెడ్డిపై అనర్హత వేటును ముందుకు తెస్తే రాజకీయంగా సమస్యలు ఎదురవుతాయని టిఆర్ఎస్ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+