ఔట్‌లుక్ కేసు: స్మితా సబర్వాల్‌కు న్యాయసాయం, రూ.15లక్షలు విడుదల!
హైదరాబాద్: ఔట్ లుక్ మేగజైన్ పైన న్యాయపోరాటం చేసేందుకు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుతవం సహాయం అందించనుంది.
స్మితా సబర్వాల్ పైన కొద్ది రోజుల క్రితం ఔట్ లుక్ మేగజైన్ ప్రచురించిన కథనం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీని పైన పలు కేసులు నమోదయ్యాయి. ఈ అంశంలో స్మితా సబర్వాల్‌కు న్యాయ సాయం అందించే నిమిత్తం ప్రభుత్వం రూ.15 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అభ్యంతకర కథనాలు ప్రచురించిన ఔట్‌లుక్ పత్రిక పైన చర్యలు తీసుకోవాలని పలు కేసులు నమోదయ్యాయి.
ఔట్‌లుక్ ఎడిషన్‌లో ప్రచురితమైన డీప్‌త్రోట్ కాలంలో తెలంగాణ నో బోరింగ్ బాబు అంటూ అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, జూనియర్ ఐఏఎస్ అధికారిణిని సీఎం కార్యాలయంలో అతి ముఖ్యమైన పదవిలో నియమించడం ఒక మిస్టరీ అని, ఐఏఎస్ అధికారిణి ఇటీవల జీన్స్, టీ షర్టు వేసుకుని ఫ్యాషన్ షోలో క్యాట్‌వాక్ చేస్తూ అబ్బురపరిచిందని కథనంలో పేర్కొనడం హేయమైన చర్యగా ఖండించారు.












Click it and Unblock the Notifications