కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి: 18 వేల కోట్లంటూ ఈసీకి టీఆర్ఎస్
హైదరాబాద్: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ని కోరారు.

18వేల కోట్ల కాంట్రాక్టు అంటూ టీఆర్ఎస్ నేతలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీజేపీ నుంచి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్లు ఓ టీవీ ఛానల్‌లో స్వయంగా చెప్పారని తెలిపారు. ఇది ప్రజా స్వామ్యానికి అవహేళన చేసే చర్య అని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రిప్రజెంటేషన్ ఆప్ పీపుల్ యాక్ట్ గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు.
ఇచ్చి పుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి విన్నవించామని చెప్పారు.

కోమటిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా డిస్‌క్వాలిఫై చేయాలని కోరామన్నారు. కాంట్రాక్ట్‌లలో వచ్చిన డబ్బు సంచులతో మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. ఇలాంటి వారిని ఎన్నికల్లో నిలబడేందుకు ప్రోత్సాహించవద్దని ఎన్నికల అధికారిని కోరామని తెలిపారు.

ఈటల, వివేక్‌లకు రాజగోపాల్ రెడ్డి వాటా అంటూ టీఆర్ఎస్
ఈటెల రాజేందర్, వివేక్‌లకు కూడా వాటా ఇస్తానని రాజ్‌గోపాల్ రెడ్డి చెప్పినట్లు తెలిసిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ, అమిత్‌షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడన్నారు. ప్రజల కోసం మునుగోడు అభివృద్ది కోసం రాజగోపాల్‌రెడ్డి ఏనాడూ పని చేయలేదని, కేవలం పైసల అహంకారం ఆయనలో ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు కృత్రిమ ఎన్నిక తెచ్చారని.. రాజగోపాల్ రెడ్డి, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొట్టడం ఖాయమని, మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications