టీఆర్ఎస్‌కు పెరుగుతున్న వ్యతిరేకత....కేసీఆర్ అనే బ్రాండ్ గట్టెక్కిస్తుందా..?
Recommended Video

తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. డిసెంబర్ 7న ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ప్రచారం ఒకలా ఉంటే... టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంకు వెళ్లినప్పుడు మాత్రం చేదు అనుభవమే ఎదుర్కొంటున్నారు. ప్రజలు గులాబీ నేతలను నడిరోడ్డుపైనే నిలదీస్తున్నారు. గతవారం తాజా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారానికి వెళ్లగా ఆయన కాన్వాయ్‌ను రైతులు అడ్డుకుని నిలదీశారు.
అతను చెప్పే మాటలు కూడా వినేందుకు సుముఖత చూపలేదు రైతులు. దీంతో ప్రచారం అక్కడితోనే ఆగిపోయింది. ఇది వనపర్తి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తమ పంటలకు సరిపడా నీరు ఇవ్వాలనే తమ డిమాండ్ పై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరారు. జూపల్లి కృష్ణారావుకు తొలిసారిగా ఎదురవుతున్న చేదు అనుభవం కాదిది.. అంతకుముందు కూడా ఓ చోట ప్రజలు ఆయన్ను నిలదీశారు. దీంతో ఆయన కారు టాపుపైకి ఎక్కి వారిని సముదాయించాల్సి వచ్చింది.

ఒక్క నెలలోనే గులాబీ పార్టీకి ఏడు చేదు అనుభవాలు
గత నెలలో ఇలా గులాబీ నేతలకు ఎదురైన చేదు అనుభవాలు ఏడున్నాయి. ప్రచారంకు వెళ్లిన వారికి ప్రజల నుంచి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. కొన్ని గ్రామాలైతే ఎన్నికలు బహిష్కరించాలనే నిర్ణయానికొచ్చేశాయి. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ముందుగానే నేతలు బాండ్ పేపర్లపై సంతకం చేసి ఆ తర్వాతే ఓట్లు అడగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఆదిలాబాద్ జిల్లా నర్నూర్ మండలంలో పంట నష్టంతో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన భర్త ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆమెను తన భుజాలపై మోసుకుని వాగు దాటాడు. అయితే దారి మధ్యలోనే ఆ మహిళా రైతు మృతి చెందింది. ఈ క్రమంలోనే ఓ వారం తర్వాత ప్రచారంకు వచ్చిన నేతలను అడ్డుకున్నారు గ్రామస్తులు. రోడ్లు లేవు, వంతెనలు లేవు... ఓట్లు మాత్రం కావాలా... ఓట్లు అడిగేందుకు మా గ్రామాలకు రాకండి అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు గ్రామస్తులు.

ఓటు అడిగే హక్కు నీకు లేదు
ఇక వరంగల్ జిల్లా వర్దన్నపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు గ్రామస్తుల సెగ తగిలింది. అసలు అభివృద్ధే లేదు.. ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చావంటూ ప్రజలు నిలదీశారు. అంతేకాదు ఓటు అడిగే హక్కు నీకు లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అభ్యర్థి రమేష్ ఏమి చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్లి పోయాడు. ఇలాంటి ఘటనలు కచ్చితంగా గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెట్టివేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అభ్యర్థులపై వ్యతిరేకత పెరుగుతుండటంతో గులాబీ పార్టీకి ఈసారి ఎన్నికలు అంత ఈజీగా ఉండబోవని వారు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ ఇది పేరు కాదు..ఒక బ్రాండ్
అభ్యర్థులపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ వీరిని ఆదుకుంటుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కచ్చితంగా కేసీఆర్ ఇమేజ్ వ్యతిరేకత ఉన్న నాయకులను గట్టున పడేసే అవకాశాలున్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో అభ్యర్థుల పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందకపోయినప్పటికీ కేసీఆర్ బ్రాండ్ కారు పార్టీని కాపాడుతుందని చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు గాను 100 స్థానాలు ఆడుతూ పాడుతూ గెలుచుకుంటుందని ఇప్పటికే కేసీఆర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అంతేకాదు గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపర్చిన అన్ని హామీలను టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందని చెప్పుకొస్తున్నారు కేసీఆర్. అంతేకాదు గతవారం విడుదల చేసిన టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో ప్రచారానికి వెళుతున్న నేతల్లో కాస్త ఊరటనిస్తోందంటూ చెబుతున్నారు.

గులాబీ పార్టీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో విపక్షాలు విఫలం
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో విపక్షాలు విఫలమవుతున్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇది టీఆర్ఎస్‌కు కలిసివచ్చే అంశంగా వారు భావిస్తున్నారు. 2014లో తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్‌కు కలిసొచ్చిందని చెబుతున్న రాజకీయ విశ్లేషకులు ఆ సమయంలో కేసీఆర్ ముందుండి ఉద్యమానికి నాయకత్వం వహించడంతో కింది స్థాయి నుంచి ఆయనకు ఆయన పార్టీకి మద్దతు లభించిందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని పూర్తయ్యాయో అనేదానిపై కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని వివరించారు. కేసీఆర్‌కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు కచ్చితంగా అనే సమాధానం పొలిటికల్ అనలిస్టుల నుంచి వస్తోంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications