వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళ్లు అరిగిందాన్క తిరగనియ్.!నోరు నొచ్చిందాన్క ఒర్రనియ్.!మనకు అక్కర్లే.!షర్మిళ తీరుపై టీఆర్ఎస్ స్పందన.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వైయస్సార్ టీపీ నాయకులకు ఓ విషయంలో పూర్తి స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. గులాబీ నాయకులకు నోటికొచ్చినట్టు తిట్టుంచుకున్న తర్వాత గానీ జ్ఞానోదయం అయినట్టు లేదు. గాలికి పోయే రేగి కంపకు ఎందుకు కాలు అడ్డం పెట్టడం అనే సత్యాన్ని ఆలస్యంగా గ్రహించిన పింక్ నేతలు ఆ నాయకురాలు ఎటు వెళ్తే మనకెందుకు, అసలు స్పందించకుండా ఉంటే సరిపోయె అనే వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ గులాబీ నేతలు ఎవరి గురించి ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారో ఇప్పటికే అర్దం అయ్యి ఉండి ఉంటుంది.

 ఎందుకు తిట్టించుకునుడు.. షర్మిళ అంశంలో గులాబీ నేతల కీలక నిర్ణయం

ఎందుకు తిట్టించుకునుడు.. షర్మిళ అంశంలో గులాబీ నేతల కీలక నిర్ణయం

తెలంగాణలో ఇటీవల పురుడుపోసుకున్న రాజకీయ పార్టీ వైయస్సార్ టీపి. ఆపార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ పార్టీ స్థాపించిన వందో రోజు నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఒకరకంగా తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగానే షర్మిళ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై స్పందించడం, అదికార గులాబీ పార్టీని నిలదీయడం, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, నిరుద్యోగుల పట్ల గాళాన్ని విప్పడం, రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అన్నిటికి మంచి మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి కేటీఆర్ ఎవరు అని సంభోదించి రాజకీయాల్లో సంచలనాలు సృష్టించేందుకే రంగప్రవేశం చేసాననే సంకేతాలు ఇచ్చారు షర్మిళ.

 షర్మిళ ఎంతైనా విమర్శించనీ.. మాకు మాత్రం సంబందం లేదంటున్న గులాబీ నేతలు..

షర్మిళ ఎంతైనా విమర్శించనీ.. మాకు మాత్రం సంబందం లేదంటున్న గులాబీ నేతలు..


అంతే కాకుండా మీడియా సమావేశాలు నిర్వహించి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి తరుణంతో ప్రతి మంగళవారం నిరుద్యోగులకు బాసటగా ఉంటూ ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు భరోసా కల్పించే క్రమంలో నిరుద్యోగ దీక్షను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన అంశంలో చంద్రశేఖర్ రావు ఎలాంటి హామీ ఇచ్చారు, ఇప్పుడేం చేస్తున్నరనే అంశాలను ఏకరువుపెడుతున్నారు. అదీగాక ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వ విదానాల మీద ధ్వజమెత్తుతున్నారు షర్మిళ.

 మంత్రి నిరంజన్ రెడ్డికి చేదు అనుభవం.. అందుకే మిగతా నేతల అనూహ్య నిర్ణయం..

మంత్రి నిరంజన్ రెడ్డికి చేదు అనుభవం.. అందుకే మిగతా నేతల అనూహ్య నిర్ణయం..

కాగా షర్మిళ విమర్శలకు ప్రతివిమర్శలు చేసేందుకు అధికార పార్టీ నేతలు గానీ, మంత్రులు గానీ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. నిరుద్యోగుల అంశంలో ఎన్ని నోటిఫికేషన్లు వేసారో స్పష్టత ఇవ్వాలని ఇటీవల షర్మిళ పాదయాత్రలో డిమాండ్ చేసారు. అందుకు మంత్రి నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుని షర్మిళ పట్ల నోరు జారారు. అందుకు వైయస్సార్ టీపి నేతలతో పాటు, షర్మిళ స్వయంగా స్పందించారు. మహిళా పార్టీ అధినేత పట్ల మాట్లాడే సభ్యత ఇదేనా అంటే వైయస్సార్ టీపి నాయకురాళ్లు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత్రిగా షర్మిళ కూడా ఘాటుగానే స్పందించారు.

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS
 ఎంతైనా దూషించనివ్వండి.. ప్రతిస్పందించేది లేదంటున్న గులాబీ దళం..

ఎంతైనా దూషించనివ్వండి.. ప్రతిస్పందించేది లేదంటున్న గులాబీ దళం..

దీంతో గులాబీ పార్టీ నేతలతో పాటు మంత్రులు కూడా ఓ అవగాహరకు వచ్చినట్టు చర్చ జరుగుతోంది. ప్రతిపక్షపార్టీల ఆరోపణలతోనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుంటే తాజాగా షర్మిళ పార్టీ నేతలతో కూడా తిట్టించుకోవడం అవసరమా అనే నిర్ణయానికి పార్టీ నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఏ సమస్యగురించైనా మాట్లాడుకునే స్వేచ్చ షర్మిళకు ఉందని, షర్మిళ వ్యాఖ్యల ప్రభావం ప్రజల్లో ఉంటే స్పందించాలి గాని ఏమీ లేని విమర్శలకు ఎందుకు స్పందించాలనే తుదినిర్ణయానికి వచ్చారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కాళ్లు అరిగిపోయేదాన్క తిరిగినా, నోరు నొచ్చేదాన్క ఒర్రినా పట్టించుకోవద్దనే నిర్ణయానికి తెలంగాణ నేతలు వచ్చినట్టు తెలుస్తోంది.

English summary
Neither the ruling party leaders nor the ministers have shown much interest in responding to Sharmila's criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X