రేవంత్‌పై ప్రతీకారం కోసం ఎదురుచూపు: కొడంగల్‌లో మంత్రి సోదరుడు సిద్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే తమ గెలుపు ఖాయమని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. రేవంత్ రాజీనామా స్పీకర్ వద్దకు వస్తే ఆయన వెంటనే ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.

రేవంత్ రెడ్డి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం?

రేవంత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని టీఆర్ఎస్

రేవంత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని టీఆర్ఎస్

అంతేకాదు, తమ అధినేత, తొలి నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మాటల తూటాలు పేల్చుతున్న రేవంత్ రెడ్డికి ఉప ఎన్నికలు వస్తే ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో చుక్కలు చూపించాలనే ఉత్సాహంతో టీఆర్ఎస్ కేడర్ ఉంది. రేవంత్‌ను ఓడించి కేసీఆర్ పైన దూకుడుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.

మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు రంగంలోకి

మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు రంగంలోకి

కొడంగల్‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేంద్రను బరిలో దించేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నిక బాధ్యతను రాష్ట్రమంత్రి హరీశ్ రావుకు అప్పగించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఉప ఎన్నిక రాదని కాంగ్రెస్ ధీమా, కానీ

ఉప ఎన్నిక రాదని కాంగ్రెస్ ధీమా, కానీ


కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఉప ఎన్నిక రాదని, వస్తే మాత్రం రేవంత్ విజయం సాధిస్తారని భావిస్తోందని సమాచారం. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గతంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

టీఆర్ఎస్‌దీ అదే తీరు, వస్తే మాత్రం సిద్ధం

టీఆర్ఎస్‌దీ అదే తీరు, వస్తే మాత్రం సిద్ధం

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. ఇంకా చాలామంది టీఆర్‌ఎస్‌లో చేరినా రాజీనామా చేయలేదు. తలసాని రాజీనామా స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీంతో రేవంత్‌ రాజీనామా అంశంపై టీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఉప ఎన్నిక వస్తే మాత్రం సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that TRS may field Minister Mahender Reddy's brother Narendra in Kodangal, if bypoll come.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి