• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గులాబీ స‌భ విఫ‌లం.. కాంగ్రెస్ విజ‌యం గా మారింది..! రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు..!!

|

హ‌ద‌రాబాద్: గులాబీ పార్టీ ఒక త‌ప్పు వంద త‌ప్పుల‌కు నాంది కాబోతోందా..? లేక జ‌రిగిన త‌ప్పునుండి గుణ‌పాఠం నేర్చ‌కుని రాటుదేలుతుందా..? ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో రెండే రెండు అంశాల ప‌ట్ల చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ విఫ‌లం కావ‌డంతో గులాబీ వాడిపోయే ద‌శ‌కు చేరింద‌ని, అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కి ప్ర‌జాద‌ర‌ణ అనూహ్యంగా పెరింగింద‌ని.. ఈ రెండు అంశాల ప‌ట్ల చ‌ర్చ తారాస్థాయిలో జ‌ర‌గ‌డ‌మే కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి. ఎన్నిక‌ల్లో గెలిచినంత మాన‌సిక సంత్రుప్తిని పొందుతోంది కాంగ్రెస్ పార్టీ. విఫ‌ల‌మైన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా అభివ‌ర్ణించుకుంటోంది టీపీసీసీ.. దీంతో కాంగ్రెస్ నేత‌ల మొహంలో వెయ్యి వోల్టుల‌ వెలుగులు జిగేలుమంటున్నాయి.

తొలిసారి ప్ర‌జాక్షేత్రంలో కేసీఆర్ ప‌రాజ‌యం..!త‌మ‌దే విజ‌యమంటున్న కాంగ్రెస్..!!

తొలిసారి ప్ర‌జాక్షేత్రంలో కేసీఆర్ ప‌రాజ‌యం..!త‌మ‌దే విజ‌యమంటున్న కాంగ్రెస్..!!

సహజంగా స్పీచ్ లకు కెసీఆర్ పెట్టింది పేరు. అలాందిటి ప్రగతి నివేదిన సభలో మాత్రం ఈ జోష్ లేకుండా పోయింది. అందుకే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. కెసీఆర్ ఇక ఇంటికే అని కాంగ్రెస్ దూకుడు పెంచుతుంటే, కోదండరాం కూడా ప్రగతి నివేదన సభ కెసీఆర్ కు వీడ్కోలు సభ అని వ్యాఖ్యానించారు. ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేకపోవటం. కెసీఆర్ స్పీచ్ లో వాడి.వేడి లేకపోవటంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యంగా గతంలో ఎన్నడూలేని రీతిలో కెసీఆర్ స్పీచ్ ఇస్తున్న సమయంలోనే సభకు హాజరైన వారిలో చాలా మంది వెళ్లిపోవటం అనేది చరిత్రలో తొలిసారి జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

  కేసీఆర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన రేవంత్ రెడ్డి
  ప‌బ్లిక్ ప‌ల్స్ ప‌ట్టుకోలేక పోయిన కేసీఆర్..! ఢీలా ప‌డ్డ తెలంగాణ ప్ర‌జానికం..!!

  ప‌బ్లిక్ ప‌ల్స్ ప‌ట్టుకోలేక పోయిన కేసీఆర్..! ఢీలా ప‌డ్డ తెలంగాణ ప్ర‌జానికం..!!

  వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలనుకున్న వారు నియోజకవర్గం నుంచి 20000 వేల మందిని తరలించాలని కేసీఆర్ టార్గెట్ పెట్టారంటూ వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకే టికెట్‌ దక్కాలనే ఆశ, అధినేత కేసీఆర్‌ దృష్టిలో పడాలనే తాపత్రయంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఆశావహులు పోటీ పడి మరీ జనాన్ని తరలించారు. వాహనాలు, భోజనాల ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం కొంత ఆర్థిక సహకారం అందించినా అంతకు రెండింతల మొత్తాన్ని ఖర్చు పెట్టుకొని ప్రజలను వాహనాల్లో తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అనుకున్నంత మంది మాత్రం స‌భ‌కు రాలేదని గులాబీ ద‌ళం మ‌ద‌న ప‌డుతోంది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే భారీ సభగా నిలిచింది. ఇంద జాగ్ర‌త్త‌లు తీసుకున్నా సభ విప‌లం కావ‌డానికి గ‌ల కార‌ణాల‌పై గులాబీ పార్టీ లోతైన విశ్లేష‌ణ చేస్తోంది.

  టీఆర్ఎస్ చ‌రిత్ర‌లో ఇంత చెత్త‌గా మాట్లాడిన సంద‌ర్బాలు లేవు..!

  టీఆర్ఎస్ చ‌రిత్ర‌లో ఇంత చెత్త‌గా మాట్లాడిన సంద‌ర్బాలు లేవు..!

  టీఆర్‌ఎస్‌ 2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించింది. కానీ, ఏ సభకూ ఇంత ప్రచారం కల్పించలేదు. అందుకే ఈ సభపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సభలో ముందస్తు ఎన్నికల గురించి ప్రకటన చేస్తారని, ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడతారని చాలా మంది ఆశించారు. కానీ, కేసీఆర్ నిరాశపరిచారు. కేవలం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టిన పథకాలపైనే దృష్టి సారించారు. మరోసారి అధికారం కావాలని అర్జించారు. ఈ కారణంగానే ప్రగతి నివేదన సభ ఫెయిల్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, కేసీఆర్ ఇప్పటి వరకు పాల్గొన్న ఏ సభలోనూ ఈ తరహా ప్రసంగం చేయకపోవడమూ ఒక కారణమనే చ‌ర్చ జ‌రుగుతోంది.

  వంద సునామీల బ‌లంతో కాంగ్రెస్..! పూర్వ‌వైభ‌వం దిశ‌గా అడుగులు..!!

  వంద సునామీల బ‌లంతో కాంగ్రెస్..! పూర్వ‌వైభ‌వం దిశ‌గా అడుగులు..!!

  ఈ సభ ఫెయిల్ అవడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ సభ కంటే తాము నిర్వహించిన రాహుల్ గాంధీ సభే గ్రాండ్ సక్సెస్ అయిందని ఆ పార్టీ భావిస్తోంది. అంతేకాదు, ప్రగతి నివేదన సభ జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి నివేదన పేరుతో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, దానిని వినియోగించుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ‘కేసీఆర్‌ హఠావో, తెలంగాణకో బచావో' అన్న నినాదంతో ఇక ముందకు వెళతామని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ ప‌రాజ‌యం కాంగ్రెస్ విజ‌యానికి దోహ‌ద‌ప‌డింద‌ని తారా స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  with the failure of trs party nivedana public meeting congress party says it is strengthening in telangana.tpcc leaders saying that trs party failed to implement the schemes thats why public rejecting kcr in telangana. leaders sayingnt that congress party retains its glory and comes into power in the next elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more