కెసిఆర్ మరోసారి సిఎం అయితే ఎమ్మెల్యేగా కొనసాగను: కోమటిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ మరోసారి సిఎంగా ఎన్నికైతే తాను ఎమ్మెల్యే గా ఉండనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

బుదవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకుగాను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను అభినందించారని ఆయన చెప్పారు.మిషన్ భగీరథ పనుల్లో ప్రజా ప్రతినిధులు ముడుపులు తీసుకొన్నారని , అవసరం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని ఆయన చెప్పారు.

trs mla's appreciated me :komatireddy venkat reddy

నల్గొండ జిల్లాలో చేపట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో అనేక సమస్యలున్నాయని చెప్పారు.లక్షమందితో కలిసి ప్రాజెక్టు పనులకు అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. తాను సిఎం రేసులో లేనని, కాంగ్రెస్ పార్టీలో ఎవరూ అవకాశాలు ఇవ్వరని కోమటిరెడ్డి చెప్పారు.

లాబీయింగ్ చేసి పదవులు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పాదయాత్రను హైకమాండ్ వద్దన్నదన్నారు.అంతేకాదు వైఎస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ ఇష్టపడలేదని ఆయన వెల్లడించారు.జానారెడ్డిని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తామని కోమటిరెడ్డి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
trs mla's appreciated me said congress mla komati reddy venkat reddy on wednesday .
Please Wait while comments are loading...