షాక్: 'నాకు జితేందర్ రెడ్డి వల్లే మంత్రి పదవి రాలేదు', 'రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా'

Posted By:
Subscribe to Oneindia Telugu

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకుల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపి జితేందర్ రెడ్డి ల మద్య మాటల యుద్దం సాగుతోంది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకుల మద్య కొంత కాలంగా నిపురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

trs mla srinivas goud allegations on mp jitender reddy

మహబూబ్ నగర్ ఎంపి జితేందర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు.అయితే ఈ విమర్శలను జితేందర్ రెడ్డ తిప్పికొట్టారు.

తనకు మంత్రిపదవి రాకుండా ఎంపి జితేందర్ రెడ్డి అడ్డుకొన్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తనకు కొందరు ఈ విషయాన్ని చెప్పారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

అయితే శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుపడినట్టు శ్రీనివాస్ గౌడ్ నిరూపిస్తే రాజకీయాలే వదిలేస్తానని జితేందర్ రెడ్డి ప్రకటించారు.

శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి ఇవ్వాలని కోరిందే తానని ఆయన చెప్పారు.ఉద్దేశ్యపూర్వకంగానే తనకు , శ్రీనివాస్ గౌడ్ కు మద్య విబేధాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
mahaboobnagar trs mla srinivas goud allegations on mp jitendar reddy on sunday.
Please Wait while comments are loading...