టీఆర్ఎస్ ఎమ్మెల్యే భార్యకు యాక్సిడెంట్: లారీని ఢీకొట్టిన కారు..
భూపాలపల్లి సమీపంలోని కమలాపూర్ వంతెన వద్ద శైలజ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో శైలజకు, డ్రైవర్ మల్లేష్‌కు గాయాలయ్యాయి.
భూపాలపల్లి: మంథని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య, మంథని సర్పంచ్ శైలజ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో.. డ్రైవర్ సహా ఆమె గాయాలపాలైనట్లు సమాచారం.
వరంగల్ లోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరైన శైలజ.. మంథనికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి సమీపంలోని కమలాపూర్ వంతెన వద్ద శైలజ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో శైలజకు, డ్రైవర్ మల్లేష్‌కు గాయాలయ్యాయి.

ప్రమాదానంతరం వీరిద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రథమ చికిత్స అనంతరం శైలజ మరో వాహనంలో మంథనికి వెళ్లిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications