వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ వైపు ఎమ్మెల్యేలు, నేతలు.. ఫోన్లు వస్తున్నాయంటూ ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

యాదాద్రిభువనగిరి: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్లు ఈ ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. యాదగిరిగుట్టలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల రాజేందర్ మాట్లాడారు.

రాకెట్ వేగంతో బీజేపీ దూసుకుపోతోందన్న ఈటల

రాకెట్ వేగంతో బీజేపీ దూసుకుపోతోందన్న ఈటల

కేసీఆర్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ను మట్టికరిపించే అవకాశం హుజూరాబాద్ ప్రజలకు దక్కిందని, ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలకు దక్కబోతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు.

మోడీ ఒక్క రోజు సెలవు తీసుకోకుంటే.. కేసీఆర్ మాత్రం

మోడీ ఒక్క రోజు సెలవు తీసుకోకుంటే.. కేసీఆర్ మాత్రం

బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై ఈటల మండిపడ్డారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఢిల్లీ చక్రం తిప్పడం కాదు.. ఉన్న ఉద్యోగం ఊడుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ మంత్రుల్లో సగం మంది తెలంగాణ వద్దన్నవాళ్లేనని అన్నారు. ప్రధాని మోడీ 8 ఏళ్లల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తే.. కేసీఆర్ మాత్రం ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదని ఎద్దేవా చేశారు. ఈ 8 ఏళ్లలో సాధారణ ప్రజలు సీఎంను కలిసే భాగ్యం దక్కిందా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతమే బీజేపీ కర్తవ్యమన్న ఈటల

కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతమే బీజేపీ కర్తవ్యమన్న ఈటల

కేసీఆర్ ఉంటే ప్రగతిభవన్‌లో.. లేదంటే ఫాంహౌస్‌లోనే ఉంటారన్నారు ఈటల. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు దళితుల అసైన్డ్ భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఫారెస్టు భూముల పేరుతో గిరిజనుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించడమే బీజేపీ కర్తవ్యమని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీవైపు.. ఫోన్లు వస్తున్నాయన్న ఈటల

కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తారని మిడిసిపడుతున్నారని ఈటల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మూలమైన యూపీలోనే 2 సీట్లు వచ్చాయని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అంతరించిపోయిందన్నారు. కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ చెప్పారు. తనకు ఇంతకుముందే కొందరు నేతలు ఫోన్ చేసి బీజేపీలో చేరతామని చెప్పారని తెలిపారు.

English summary
TRS MLAs wants to join BJP: Etala Rajender hits out at CM KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X